ఏపీలో టీడీపీ గల్లంతు .. చంద్రబాబుకు రిటైర్‌మెంట్


ఏపీలో టిడిపి గల్లంతు కావడం ఖాయం అని, చంద్రబాబుకు రిటైర్‌మెంట్ ఇచ్చే దిశగా ప్రజలు బుద్ధి చెబుతారని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. గతంలో అవినీతి పాలనకు ప్రజలు తీర్పునిచ్చారని, టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతూ ఐదేళ్ల టీడీపీ పాలనలో నడిచిన మాఫియా ముఠాలో జిల్లాల వారీగా మంత్రులతో ప్రజా ధనాన్ని దోచుకున్నారని, అటువంటి అవినీతి పాలనను అంతం చేయాలని శ్రీకాకుళంలో పిలుపిచ్చారు. 

ముఖ్యమంత్రి మాఫియా ముఠాలో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషించారన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు రిటైర్‌మెంట్ ఇచ్చే దిశగా ప్రజలు బుద్ధి చెబుతారన్నారని ఆరోపిస్తూ  జిల్లాలను మంత్రులు పంచుకొన్నారని, విశాఖ జిల్లాను గంటా, శ్రీకాకుళం జిల్లాను అచ్చెన్నాయుడు పంచుకొని దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. డమ్మీ మంత్రి కళావెంకటరావు అని ధ్వజమెత్తారు. 

ప్రధాని మోదీపై టీడీపీ నేతలు చేస్తున్న చిల్లర వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం కోసం మోదీ పనిచేస్తున్నారన్నారని చెబుతూ కేంద్రం లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటే ముఖ్యమంత్రి భయపడి పారిపోయారని విమరిశలు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 

చంద్రబాబుకు అధికారం పోయాక వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి వుంటుందని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా రూ. 24 వేల కోట్లు నిధులు ఇచ్చిందని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని సక్రమంగా వినియోగించకుండా సొంత ప్రయోజనాలకు, కమీషన్లకు కక్కుర్తిపడిన బాబు చేసిన దుర్వినియోగాన్ని కేంద్ర మంత్రులు సాక్ష్యాధారాలతో సహా బయటపెడితే బాబు ఎందుకు బదులు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

తిరుమల తిరపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే దిశగా ముఖ్యమంత్రిగా బాబు వ్యవహారించారని విమర్శించారు. తిరుమల తిరుపతి అనేది ధార్మిక సంస్థ అని అక్కడ అన్య మతస్థులను పెట్టడాన్ని తప్పుపట్టారు.