ప్రధాని రేస్ లో ముందున్నది మోదీయే !

ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి 204లో వలే సొంతంగా మెజారిటీ వస్తుందా, రాదా అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గాని, ప్రధానిగా ఎవ్వరు కావలి అంటే ప్రధాని నరేంద్ర మోదీ పెరుగే అత్యధికంగా ఏ సర్వే జరిగినా చెబుతున్నారు. ఆ తర్వాత స్థానంలో రాహుల్ గాంధీ ఉంటున్నా, ఇద్దరి మధ్య తేడా ఎక్కువగా ఉంటున్నది. 

తాజాగా, సి ఓటర్ - ఐ ఏ ఎన్ ఎస్ సర్వేలో దేశంలో 43.3 శాతం మంది ప్రధానిగా మోదీని కోరుకోగా, 37.2 శాతం మంది రాహుల్ పేరు చెప్పారు. అయితే గృహిణులు, కార్మికులలో ఎక్కువగా రాహుల్ గాంధీని కోరుకొంటున్నా, ఈ వర్గాలలో సహితం మోదీయేనే ముందున్నారు. 

దేశంలో ఉపాధి ప్రధాన సమస్యగా అత్యధికులు చెబుతున్నా నిరుద్యోగులతో  63.6  శాతం మంది మాత్రం మోదీ ప్రధానిగా ఉండాలని కోరుకొంటుండగా, 26 శాతం మంది మాత్రమే రాహుల్ ను కోరుకొంటున్నారు. గృహిణులలో 43.3 శాతం మంది మోదీని  కోరుకొంటుండగా, రాహుల్ ను చాలా దగ్గరగా 37.2 శాతం మంది కోరుకొంటున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులలో 61.1 శాతం మంది మోదీని ప్రధానిగా కోరుకొంటూ ఉండగా, 26 శాతం మంది మాత్రమే రాహుల్ ను కోరుకొంటున్నారు. భూమి లేని వ్యవసాయ కార్మికులలో 48.2 శాతం మంది మోదీని కోరుకొంటూ ఉండగా, 35.4 శాతం మంది మాత్రం రాహుల్ ను కోరుకొంటున్నారు. సాధారణ కార్మికులలో 48.9 శాతం మంది మోదీ ప్రధాని కావలి అని చెబుతూ ఉండగా, 35 శాతం మంది రాహుల్ ను కోరుకొంటున్నారు.