‘మా’ నిధుల గోల్‌మాల్‌పై రసభ

నటీనటులకు భరోసాగా ఉండవలసిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) తరచూ వివాదాలకు కేంద్రమవుతూ మీడియాకు ఎక్కడ పరిపాటి అవుతున్నది. తాజాగా  సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం జరిగిన్నట్లు వచ్చిన ఆరోపణలు సంస్థలో పెను దుమారం సృష్టిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం ఈరోజు సమావేశమై ఈ ఆరోపణలను ఖండించినా సెగ రగులుతూనే ఉంది. చర్చించింది. ఈ సమావేశానికి ‘కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్‌ హాజరయ్యారు.

సమావేశం అనంతరం శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ నిధులు దుర్వినియోగమయ్యాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మా’ అధ్యక్షుడు శివాజీరాజా స్పష్టం చేసారు. అసోసియేషన్‌లో 5పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని సవాల్‌ చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని, నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేసారు.

వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్‌ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని తెలుపుతూ అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు

అయితే మా జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ నటుడు నరేశ్‌ ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగిన్నట్లు బలమైన అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఈ విషయంలో  శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు.

 ‘మా’ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్‌ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ అంటూ ఆయనకు సంబంధించిన కాల్‌, మెసేజ్‌ డాటాను బయటపెట్టారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పగా  శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానని చేపప్రు.

విదేశీ కార్యక్రమాల గురించి శివాజీరాజా తనకు ఎటువంటి వివరాలు చెప్పలేదని ఆరోపిస్తూ అమెరికా ఈవెంట్‌ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్‌ క్లాస్‌లో రూ3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేశారని విస్మయం వ్యక్తం చేసారు. ఆ డబ్బంతా ఎవరిదంటూ ప్రశ్నించారు. మా తరపున క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సెక్రటరీగా ఉన్న తనకు అసలు ఎటువంటి విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.