మోదీ ఏయిర్ స్ట్రైక్స్ పై మమతా కన్నెర్ర

మోదీ ఏయిర్ స్ట్రిక్స్ పై మమతా బెనర్జీ కన్నెర్ర చేశారని.. దేశ భద్రత కోసం తాము పాటుపడతామని ప్రకటిస్తే ప్రకటనపై కూడా గుర్రుగా ఉన్నారని అందుకే మమతా బెనర్జీకి బీజేపీ పార్టీ అంటే కోపమని పశ్చిమ బెంగాల్ అలీపూర్‌ద్వార ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు.

ఉగ్రవాదులను ఏరివేయడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె ఓట్‌బ్యాంక్ రక్షించుకునేందుకే మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని దేశ భద్రత ఆమెకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. చొరబాటుదారుల పట్ల వీరు విధేయుల్లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికలకు చాలా ప్రాముఖ్యం ఉందని ఈ ఎన్నికల్లో గెలుపోటములపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. 

దీంతో బాటు బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడుకునే ఎన్నికలు ఇవని చెప్పారు. బెంగాల్ సంస్కృతి, సాంప్రదాయాలకు విరుద్ధంగా మమతా బెనర్జీ పాలన కొనసాగిందని ఆయన మండిపడ్డారు. బెంగాల్‌లో 23 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అమిత్ షా జోస్యం చెప్పారు.  ఈ ఎన్నికలు తృణమూల్ పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ తీసుకువస్తుందని దీని ద్వారా ఒక్కొక్క చొరబాటుదారుడిని వదిలిపెట్టబోమని భరోసా ఇచ్ఛారు.

మోదీ బీదల కోసం మరుగుదొడ్లు, పక్కా గృహాలు, కరెంటు, గ్యాస్ సిలీండర్లు, ఆరోగ్య సేవలు కల్పించారని తెలిపారు. నిరుపేదల కోసం మమతా బెనర్జీ ఏం చేశారో దేశ ప్రజలకు వెల్లడించాలని సవాల్ చేశారు. గత కాంగ్రెస్ హయాంలో పశ్చిమ బెంగాల్‌కు ఐదేళ్ల కాలానికి రూ 1.24,900 కోట్లు ఇచ్చారని, కానీ మోదీ హయాంలో రూ 4, 24, 900 కోట్లను అభివృద్ధికి కేటాయించామని చెప్పారు.