టిడిపి కనుమరుగు కావడం ఖాయం

ఈ ఎన్నికల్లో టీడీపీకి 18 అసెంబ్లీ స్థానాలు కూడ రావని, ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్.నరసింహారావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో తెలుగుదేశం పార్టీకి పడుతుందని  కర్నూల్ లో స్పష్టం చేశారు. అధికార పార్టీ అవాస్తవాలు మాట్లాడుతు తమ పార్టీపై బురదచల్లె ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 

రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌పై ప్రజావ్యతిరేక వచ్చిందన్నారు. సీయం డ్రామా రాజకీయాలు చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరోపించారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తోందని తెలిపారు. 

బీజేపీ దేశంలోని 16 రాష్టల్ల్రో అధికారంలో ఉందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని జివిఎల్ భరోసా వ్యక్తం చేశారు. ఏపీ సీయం బీజేపీ పట్ల చాల చులకనగా, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో మమతకు పట్టిన గతే సీయంకు పడుతుందని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించే భారత ఎన్నికల కమిషన్‌పై సీయం ఆరోపణలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

సీయం దృష్టపరిపాలన సాగిస్తు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుపురం టీటీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సినీహీరో బాలకృష్ణ కవరేజికి వచ్చిన మీడియా ప్రతినిధిపై రౌడీయిజం చెలాయిస్తూ కెమెరా పగులగొట్టి దుర్మార్గంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బాలయ్య భేషరత్తుగా మీడియాకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.