మెరుపు దాడులు జరపగల ధైర్యమున్న చౌకీదార్ ...

భూమి, ఆకాశం, అంతరిక్షం.. ఎక్కడైనా సరే మెరుపుదాడులు చేయడానికి  ధైర్యమున్న చౌకీదార్ ని అంటూ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుండి మొదటి దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ గత ప్రభుత్వాలు ఇటువంటి ధైర్యం ప్రదర్షింపలేక పోయాయని దుయ్యబట్టారు. 

‘ఇది చౌకీదార్‌ (కాపలాదారుడి) ప్రభుత్వం.. మెరుపుదాడులు నిర్వహించడానికి ధైర్యం ఉన్న సర్కారు. దేశం అభివృద్ధి చెందాలి.. శత్రువుల నుంచి భద్రత పొందాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం.. ఎక్కడైనా సరే మెరుపుదాడులు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ధైర్యం ప్రదర్శిస్తోంది. అభివృద్ధి మార్గంలో అడుగులు వేసే పార్టీ మాది"అంటూ భరోసా వ్యక్తం చేశారు. 

 కానీ, ఇతర పార్టీలకు ఓ విధానం, విజన్‌ ఏమీ లేదని ప్రధాని దుయ్యబట్టారు.  తాము 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న విషయంపై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఇక్కడ తాము నిర్వహిస్తున్న ర్యాలీకి ఇంతమంది హాజరుకావడమే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. 

‘1857లో మీరట్ నుంచే బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు మొదలైంది. ఎన్డీఏ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా, గత యూపీఏ ప్రభుత్వం చాలా విషయాల్లో ఎందుకు విఫలమైందని కూడా ప్రశ్నిస్తున్నాను. ఓ వైపు మేము చేస్తున్న అభివృద్ధి ఉంది.. మరోవైపు, విజన్‌ లేని వారు ఉన్నారు' అని తెలిపారు.

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెబుతూ కొత్త యుద్ధ విమానాలు కావాలని మన వైమానిక దళం.. గత ప్రభుత్వాన్ని కోరింది. కానీ, వారి విన్నతిని ఆ సర్కారు నిరాకరించింది. కనీసం బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌లు కూడా అందించలేదని ఎద్దేవా చేశారు. యాంటీ శా