నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా మాణిక్యాలరావు

ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ స్థానాలను అభ్యర్థులను పూర్తిగా బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది.  మొదటి జాబితాలోనే 2 లోక్‌సభ, 123 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన 23  లోక్‌సభ స్థానాలకు, అలాగే 51 మంది శాసనసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. ఏపీ దేవాదాయశాఖ  మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం ఎమ్యెల్యే పి మాణిక్యాలరావును నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా  ప్రకటించింది. 

 లోక్‌సభ అభ్యర్థులు    

అరుకు(ఎస్టీ)- కెవీవీ  సత్యనారాయణ, శ్రీకాకుళం - పేర్ల సాంబమూర్తి, విజయనగరం-పీ.సన్యాసిరాజు, అనకాపల్లి- డా. గంది వెంకట స త్యనారాయణ,  కాకినాడ-యాళ్ల రామ్మోహన్‌రావు (దొరబాబు),

అమలాపురం- మానేపల్లి అయ్యాజీవేమా, రాజమహేంద్రవరం- సత్య గోపీనాథ్, నరసాపురం- మాణిక్యాలరావు, ఏలూరు- చిన్న రామకోటయ్య,
మచిలీపట్నం- కిలారు దిలీప్‌కుమార్, గుంటూరు- వల్లూరు జయప్రకాశ్ నారాయణ, బాపట్ల (ఎస్సీ)- చల్లగాలి కిశోర్‌కుమార్, ఒంగోలు- తోగుంట శ్రీనివాస్. 

నంద్యాల- డా. ఆదినారాయణ, కర్నూలు- పీవీ పార్థసారథి,
అనంతపురం- దేవినేని హంస, హిందూపురం- పొగాల వెంకట పార్థసారథి, కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు- సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, తిరుపతి (ఎస్సీ)- బొమ్మి శ్రీహరిరావు, రాజంపేట- పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి,  చిత్తూరు (ఎస్సీ)- దుగ్గాని జయరామ్. 
*
శాసనసభ అభ్యర్థులు
పలాస- కె.బాలకృష్ణ, ఆముదాలవలస- పతిన గద్దెయ్య, నరసన్నపేట- భాగ్యలక్ష్మీ, గజపతినగరం- డా. పీ.జగన్‌మోహన్‌రావు, విజయనగరం- సుబ్బారావు, విశాఖపట్నం తూర్పు- సుహాసినీ ఆనంద్, చోడవరం- మొల్లి వెంకటరమణ, మాడుగుల- విజయలక్ష్మీ సింగపల్లి, తుని- ఈశ్వర్‌రావు, రంపచోడవరం- టీ.సుబ్బారావు, రాజమహేంద్రవరం గ్రామీణ- ఆకుల శ్రీధర్, భీమవరం- కాగిత సురేంద్ర, తాడేపల్లిగూడెం- ప్రభాకర బాలాజీ కర్రి, ఉంగుటూరు- ఇంటి ఉదయ్ భాస్కర్,  గోపాలపురం (ఎస్సీ)- దున్న సుమన్‌బాబు, పోలవరం (ఎస్టీ)- వెంకట లక్ష్మీ బోరగం, గన్నవరం- గద్దిరాజు రామరాజు, 

కైకలూరు- వెంకటరామ ప్రసాద్, మచిలీపట్నం - పీ. వెంకట గజేంద్ర,
అవనిగడ్డ- జీవీ నగరాయులు, పెనమలూరు- గోపిశెట్టి దుర్గాప్రసాద్,
విజయవాడ తూర్పు- వంగవీటి నరేంద్ర, పెదకూరపాడు- గంధం కోటేశ్వరారావు, రేపల్లె- నాగిశెట్టి హర్షవర్థన్, బాపట్ల- షేక్ కరీముల్లా, నరసరావుపేట- రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్, గురజాల- పుల్లయ్య యాదవ్, మాచర్ల- అమర సైదారావు, యర్రగొండపాలెం (ఎస్సీ)- అంగలకుర్తి చెన్నయ్య, అంద్దంకి- ఉండవల్లి కృష్ణారావు, చీరాల- మువ్వల వెంకటరమణ, కందుకూరు- చంద్రగిరి వెంకటేశ్వరరావు,  గిద్దలూరు-  వేమిరెడ్డి రామచంద్రారెడ్డి. 


నెల్లూరు గ్రామీణం- కరణం భాస్కర్, సర్వేపల్లి- మస్తాన్ గౌడ్, గూడూరు (ఎస్సీ)- పరిచెర్ల బైరప్ప, వెంకటగిరి- ఎస్‌ఎస్‌ఆర్ నాయుడు,  పులివెందుల- పెరవలి సుష్మ, కమలాపురం- పాలెం సురేశ్‌కుమార్‌రెడ్డి, పాణ్యం- జీఎస్ నాగరాజు, నంద్యాల- మలికిరెడ్డి శివశంకర్, బనగానపల్లె- బిజిగల లింగన్న, డోన్- సందు వెంకటరమణ, పత్తికొండ- ఈడిగ రంగాగౌడ్, హిందూపురం- పీడీ పార్థసారథి, పెనుకొండ- జీఎం శేఖర్,
పుట్టపర్తి- హనుమంతరెడ్డి, ధర్మవరం- సుదర్శన్‌రెడ్డి, కదిరి- నాగేంద్రప్రసాద్, తిరుపతి- వీ. భవానీ శంకర్, నగరి- నిశిధరాజు