మోదీ వారణాసి నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ

లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 184 మందితో తొలి జాబితాను ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ అగ్రనేత అడ్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ నుంచి మొదటిసారి బరిలోకి దిగుతున్నారు.  

 ఇక కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో(యూపీ) , నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌(మహారాష్ట్ర), స్మృతి ఇరానీ ఆమేథీ(యూపీ), కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ఈస్ట్‌ , వీకే సింగ్‌   ఘజియాబాద్‌(యూపీ), హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ చంద్రాపూర్‌(మహారాష్ట్ర),  అనంతకుమార్‌ హెగ్డే - ఉత్తర కన్నడ(కర్ణాటక), సీపీ రాధకృష్ణన్‌- కోయంబత్తూరు (తమిళనాడు) నుండి లోక్‌సభ బరిలో నిలవనున్నారు. 

ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రముఖులు :

 హేమమాలిని :  మథుర(యూపీ), స్వామి సాక్షి మహారాజ్‌ : ఉన్నావ్‌ (యూపీ),  పూనం మహాజన్‌ ముంబై నార్త్‌- సెంట్రల్‌(మహారాష్ట్ర),

ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండే - బీడ్‌(మహారాష్ట్ర), ఉమేష్‌ జాదవ్‌ - గుల్బర్గా(ఎస్సీ- కర్ణాటక), శోభా కర్లందాజే - ఉడుపి చిక్‌మంగళూరు(కర్ణాటక),  దుష్యంత్‌ సింగ్‌ - ఝల్వార్‌ బారన్‌ (రాజస్తాన్‌), తమిళిసౌ సౌందరాజన్‌- తూతుక్కుడి(తమిళనాడు).