లోక్ సభ బరిలో కన్నా, పురందేశ్వరి, కిషన్ రెడ్డి

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో 21, తెలంగాణలో 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట నుండి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖపట్నం నుండి పోటీ చేస్తారు.

 మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నరసాపురం నుండి పోటీ చేస్తారు. మిగిలిన అభ్యర్థులు :  అనకాపల్లి- గండి సత్య వెంకట నారాయణ, శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి, అమలాపురం-అయ్యాజీ వేమ, కాకినాడ-దొరబాబు, అరకు—కేవివి సత్యనారాయణ రెడ్డి, ఏలూరు- చిన్నం రామకోటయ్య, విజయవాడ: కిలారి దిలీప్ కుమార్,  గుంటూరు -జయప్రకాశ్, నెల్లూరు- సురేశ్ రెడ్డి, తిరుపతి- శ్రీహరిరావు, అనంతపురం - చిరంజీవిరెడ్డి, హిందూపురం -పార్థసారథి, కడప- సింగారెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట: బి మహేశ్వర్ రెడ్డి, కర్నూలు-పీవీ విజయసారథి, నంద్యాల-ఆదినారాయణ.

ఇక తెలంగాణలో, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి, రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ మంత్రి డి కె అరుణ మహబూబ్నగర్ నుండి, ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావు మల్కాజ్‌గిరి నుండి పోటీ చేస్తారు.  

దిగవంత బిజెపి అధ్యక్షడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి నాగర్‌కర్నూలు నుండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి వరంగల్ నుండి పొతే చేస్తారు. 

కరీంనగర్‌ నుండి బండి సంజయ్‌, నిజామాబాద్‌ నుండి డి. అరవింద్‌,  నల్గొండనుండి గార్లపాటి జితేంద్రకుమార్‌, భువనగిరి నుండి పీవీ శ్యామ్‌సుందర్‌ రావు, మహబూబాబాద్‌ నుండి హుస్సేన్‌నాయక్‌  పోటీచేయనున్నారు