రెండేళ్ల పాలనలో అందరి అంచనాలను తారుమారు చేసిన యోగి ఆదిత్యనాథ్

అంతకు ముందు పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేని, కాషాయ వస్త్రాలు ధరించే సాధువు యోగి ఆదిత్యనాథ్ ను దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన, రెండు దశాబ్దాలుగా ఎస్పీ,  బీఎస్పీ పాలనలలో పరిపాలన వ్యవస్థనే చిన్నభిన్నం చేసిన ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసినప్పుడు చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. అరాచకానికి మారుపేరుగా ఉన్న ఈ రాష్ట్రంలో ఓ సాధువు ఎట్లా నెట్టుకు వస్తారో అని రాజకీయ ప్రత్యర్ధులు అవహేళన చేశారు. 

`గోవు' రాజకీయాలు సాగిస్తారని, దేవాలయాలు తిరుగుతూ సాంస్కృతిక కార్యక్రమాలలో మునిగి పోతారని అంచనాలు వేసిన వారంతా ఆయన రెండేళ్లు విజయవంతంగా తన పదవీకాలాన్ని పూర్తి చేయడంతో ఆశ్చర్య పోవుతున్నారు. రెండేళ్లయినా ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకత పెరగక, రోజురోజుకు ఆయన పట్ల ప్రజలలో ఆకర్షణ పెరుగుతున్నది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో అత్యంత విస్తృతమైన ప్రజాదరణ గల నేతగా గుర్తింపు పొందుతున్నారు. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రాన్ని 21వ శతాబ్దంలోనికి ఆధునికతతో నడిపిస్తున్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం అయిన మహాకుంభమేళాను ప్రయోగరాజ్ లో నిర్వహించిన తీరు సాటిలేని అసమాన పరిపాలనా దక్షతకు నిదర్శనంగా నిలిచింది. 24 కోట్లమందికి పైగా ప్రజలు వచ్చినా ఏనాడు కూడా ఎటువంటి దుస్సంఘటన జరుగకుండా అత్యద్భుతంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ కనీ, విని ఎరుగని రీతిలో విస్తృతమైన ఏర్పాట్లు  చేశారు. ఎక్కడా టూకిసలాట, అంటువ్యాధులు వ్యాపించడం వంటివి జరగనే లేదు. సాంస్కృతిక వారసత్వంగా కుంభ ను యునెస్కో ప్రకటించింది. 

స్పష్టమైన విధానాలతో పరిపాలనను ప్రారంభించారు. ఒక వంక మౌలిక సదుపాయాలను పెంపొందించడం పట్ల దృష్టి సారిస్తూ, మరోవంక  ప్రజలకు బిజిల్, పాని, సడక్ లను అందుబాటులోకి తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. యూపీని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ రాష్ట్రాన్ని తయారీరంగం కేంద్రంగా చేయడం కోసం కేంద్రం భారీ పెట్టుబడులు పెట్టింది.గంగా నదిపై జలరవాణా టెర్మినల్ ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంధర్శింప చేసుకోంది. 

యుపి పెట్టుబడుల సదస్సులో వెయ్యికిపైగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలు  రూ 4.70 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు 1,045 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సంవత్సరం దాటబోయే సరికి మార్చ్, 2019 నాటికి రూ 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. జులై, 2018లో ప్రధాని రూ 60,000 కోట్ల వ్యయంకాగల 80 ప్రాజెక్ట్ లను ప్రధాని ప్రారంభించారు. మరో రూ 65,000 కోట్ల విలువగల ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు.

దేశంలో మొదటి ట్రిలియన్-డాలర్ ఆర్ధిక వ్యవస్థగా మహారాష్ట్ర సరసన యుపి నిలవాలని ప్రధాని అభిలాషను వ్యక్తం చేస్తే, ఆ లక్ష్య సాధనకోసం ఆదిత్యనాథ్ అవిరళ కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా గతంలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా నిలచిన కాన్పూర్ కు తిరిగి ఆ గౌరవం తీసుకు వస్తున్నారు. ఇక  అగ్ర,మీరట్, వారణాసి, గోరఖపూర్, ప్రయాగరాజ్, ఝాన్షి లలో కూడా పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేస్తున్నారు. 

రాష్ట్రంలో బాగావెనుకబడిన బందెలఖండ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా ఝాన్సీలో బందెలఖండ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ ను రూ 40,000 కోట్ల వ్యవంతో అభివృద్ధి చేశారు. విద్యుత్ రంగంలో గణనీయ ప్రగతి సాధించారు. 2017లో యోగి అధికారమలోకి వచ్చినప్పుడు గృహ వినియోగం 41 శాతం, వ్యవసాయ వినియోగం 18 శాతం ఉండెడిది. మొత్తం విద్యుత్ సామర్ధ్యం 22.6 గిగావాట్లుగా ఉండెడిది. రెండేళ్లలో 28.9 మెగ్వాట్లకు, అంటే 27 శాతం పెంచారు. 

ఈ రెండేళ్లలో దేశంలో ఇచ్చిన గృహ విద్యుత్ కనెక్షన్ లలో 30 శాతం, అంటే దాదాపు మూడోవంతు యుపిలోనే ఇవ్వడం గమనార్హం. విద్యుత్ కోతల కాలం అంతరించింది. ఇప్పుడు అన్ని జిల్లా కేంద్రాలలో పూర్తిగా, తెహసిల్ కేంద్రాలలో 20 గంటల పాటు, గ్రామాలలో 16-18 గంటలపాటు విద్యుత్ సరఫరా లభిస్తున్నది. 

విద్యుత్ సరఫరా మెరుగు పడటంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వమే 53 లక్షల మెట్రిక్ టన్నుల చెరకును కొని రైతులకు నేరుగా డబ్బు చెల్లించింది. చెరుకు రైతులకు దేశంలో ఎక్కడ లేనివిధంగా త్యధికంగా రూ 44,000 కోట్లు చెల్లించింది. సంక్షోభంలో ఉన్న పరాగ్ డైరీని ఆదుకోవడం కోసం అమూల్ సలహాతో మూడు లక్షల లీటర్ల మేరకు సామర్ధం గల నూతన డైరీల నిర్మాణం చేపట్టింది. రెండేళ్లలో రెండు లక్షల ఎకరాలకు అదనంగా సాగు వసతి కల్పించారు.

అవినీతి లేని పాలన అందించాం 

గత రెండేళ్లలో మత ఘర్షణలు, అవినీతి లేని పాలన అందించామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు.  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేపట్టి మంగళవారంతో రెండేళ్లయిన సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల వరకు చేరాయని చెప్పారు. అవినీతి రహిత పాలన ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేవి కాదని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో విజయం సాధించిందని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో మత ఘర్షణలు ఎక్కడా చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. ఘర్షణల కారణంగా గతంలో కైరానా వంటి ప్రాంతాలను విడిచి వెళ్లిన కుటుంబాలు వెనక్కి వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌లలో 74 మంది నేరస్థులను హతమార్చారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే ఈ రెండేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు 150% పెరిగాయని తెలిపారు.