కేసీఆర్ పై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు!

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పై విశ్వా హిందూ పరిషద్ ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ లో జరిపిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో హిందువులపై అనుచిత వాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అనుచిత వాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ను డిమాండ్ చేశారు. 

కరీంనగర్ బహిరంగ సభలో కేసిఆర్ హిందువులను ఉద్దేశిస్తూ’హిందూ గాళ్ళు-బొందు గాళ్ళు- దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’ అంటూ అవమానించారని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకు వచ్చింది. దేశ సర్వొన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కించపరిచే విధంగా జాతీయ సమగ్రతకు భంగం కలిగే విధంగా కేసీఆర్ మాట్లాడాడని ధ్వజమెత్తారు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని వి.హెచ్.పి ప్రతినిధి బృందం లిఖితపూర్వక ఫిర్యాదు తో పాటు కేసిఆర్ ప్రసంగం సిడి ని అందించింది.

దీనికి స్పందించిన సిఈఓ రజత్ కుమార్  కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశించారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వి.హెచ్.పి బృందానికి హామి ఇచ్చారు. వి.హెచ్.పి ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామరాజు తో పాటు అధికార ప్రతినిది రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ ముఖేష్, సీనియర్ న్యాయవాది కరుణాసాగర్, వి.హెచ్.పి జిల్లా కార్యదర్శి గిరిధర్‌ లు ఉన్నారు.