ఇమ్రాన్ ఖాన్ కు ట్రంప్ భారీ షాక్

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలో ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్దటం పెద్ద సవాల్ గా పరిణమించిన పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అమెరిక అద్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్‌ ఆర్మీకి సహాయంగా ఇవ్వాల్సిన 300 మిలియన్‌ డాలర్లు ( రూ 2130 కోట్లు) నిలిపివేస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ ప్రకటించింది.

ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్‌ విఫలమైందని, తామిచ్చే సహాయాన్ని మిలిటెంట్లపై దాడులకు పాక్‌ ఉపయోగిచలేపోయిందని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్‌ డాలర్ల నిధులకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందు పాకిస్తాన్‌కు ట్రంప్‌ మరో భారీ షాక్‌ ఇచ్చారు. ఈ మేరుకు పెంటగాన్‌ అధికార ప్రతినిధి  కోనీ ఫౌల్క్‌నర్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఉగ్రవాద కార్యకలపాలను నివారించడంలో పాకిస్తాన్‌ ఘోరంగా విఫలమైంది. పాక్‌ విషయంపై అమెరికా తీవ్ర అసహనంతో ఉంది. ఉగ్రవాద చర్యలకు అణచివేసేందుకు పాక్‌పై మరింత ఒత్తిడి తెచ్చెందుకు ప్రయత్నిస్తాం. లష్కరే తోయిబా, హాక్కాని నెట్‌వర్క వంటి ఉగ్రవాదల సంస్థలను ఏరివేయడానికి ప్రయత్నిస్తాం. పాక్‌కు నిధుల విడుదల పూర్తిగా యూఎస్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన విషయం. వారి అనుమతిలేనిది నిధులను విడుదల చేయలేం ’’ అని తెలిపారు.

గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్తాన్‌పై తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ట్రంప్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ వారికి మాపై నిందలు మోపడం తప్ప మరోమి తెలీదని పాకిస్తాన్‌పై పలు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు రక్షిత ప్రాంతంగా ఉంటూ ఉంటె అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనంగా ఉండబోదని స్పష్తం చేసారు కుడా.

ప్రస్తుతం పాకిస్తాన్ 9 బిలియన్ల డాలర్ల కరెంటు ఎకౌంటు లోటులో ఉన్నదని, దీని నుండి బైట పడటం కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి కోరాలను కొంటున్నామని ఈ మధ్యనే పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి అసద్ ఉమర్ పేర్కొనడం గమనార్హం. అమెరికా తీసుకున్న చర్యతో అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి సహకారం లభించడం కుడా అంత తేలిక కాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.