కర్ణాటక మంత్రి జమీర్ ను అరెస్ట్ చేయాలి

బీజేపీకు ఓట్లు వేసిన వారు ముస్లింలు కారంటూ కర్ణాటక రాష్ట్ర పౌర ఆహార సరఫరాల శాఖామంత్రి జమీర్‌ అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే అటువంటి మతతత్వ  వాఖ్యలు చేసిన ఆయనను వెంటనే మంత్రివర్గం నుండి తొలగించి, అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్‌.శివణ్ణ డిమాండ్‌ చేశారు.

భారతదేశంలో కన్నడ సంస్కృతి, సంస్కారానికి పేరుగాంచిందని అంటూ హిందూముస్లింలు సోదరభావంతో జీవిస్తున్నారని శివన్న తుమకూరులో గుర్తు చేసారు. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా జెడిఎస్ కు చెందినా మంత్రి జమీర్‌ వ్యాఖ్యానించారని శివణ్ణ ఆరోపించారు. జమీర్‌ అహ్మద్‌ జిన్నా సంతతికి చెందిన వారని, మన వారసుడు కాదని అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ రాజకీయ నేతల కారణంగానే దేశంలో జాతీయతను చీల్చే కుట్ర జరుగుతోందని విమర్శలు గుప్పించారు.

మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రపన్నుతున్న జమీర్‌ అహ్మద్‌ను వెంటనే అరెస్టు చేయాలని బిజెపి నేత డిమాండ్ చేసారు. జమీర్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ విభజన జరిగినప్పుడు మూడుకోట్లు మాత్రమే ఉండే ముస్లింలు ప్రస్తుతానికి 20కోట్లకు చేరారని చెబుతూ అందరూ సమానంగా భావించే దేశంలో ముస్లింలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన జమీర్‌ అహ్మద్‌పై శాసనసభలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనేట్టమని తమ పార్టీ ఎమ్యేల్లెలను కోరుతున్నట్లు చేప్పారు.  కాగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జమీర్‌ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.