టీడీపీకి మరోసారి పరాభవం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా ఎన్టీ రామారావు ప్రారంభించిన టిడిపి సభ్యులు రాజ్యసభలో కాంగ్రెస్ అభ్యర్ధికి వోట్ వేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అంతగా చేసినా ఆ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారని దుయ్యబట్టారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విజయం సాధించడం కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని జివిఎల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.