గాంధీనగర్ నుంచి అడ్వాణీ స్థానంలో అమిత్‌ షా పోటీ!

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇక్కడి నుండి పోటీచేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కిశోర్‌ చౌహాన్‌ ఆదివారం తెలిపారు.

ఇప్పటి వరకూ ఆ స్థానం నుంచి పార్టీ కురువృద్ధుడు ఎల్.కె.అడ్వాణీ (91) ప్రాతినిధ్యం వహించేవారు. 1991 నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు అడ్వాణీ అక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయనను తిరిగి పోటీ చేయమని స్వయంగా అమిత్ షా గతనెలలో కలిసి కోరారు. అయితే వృద్ధాప్యం దృష్ట్యా తిరిగి పోటీకి విముఖత వ్యక్తం చేశారు. కనీసం ఆయన కుమారుడు లేదా కుమార్తెను పోటీకి దింపడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు.

దానితో ఆ స్థానంలో మరో అభ్యర్థి కోసం స్థానిక కార్యకర్తల అభిప్రాయాల్ని సేకరించేందుకు బిజెపి  పరిశీలకులను పంపించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతూ.. అమిత్‌ షా గతంలో ఇదే లోక్‌సభ నియోజకవర్గంలోని సర్‌ఖేజ్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. గాంధీనగర్‌ నియోజకవర్గంలో పరిస్థితి అమిత్ షాకు బాగా తెలుసు కాబట్టి ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే సహా పార్టీ కార్యకర్తలంతా అన్నా పరిశీలకులను పంపించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, పరిశీలకుల సమక్షంలో మాట్లాడుతూ అమిత్‌ షా గతంలో ఇదే లోక్‌సభ నియోజకవర్గంలోని సర్‌ఖేజ్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారని ఎమ్యెల్యే గుర్తు చేసారు.

గాంధీనగర్‌ నియోజకవర్గంలో పరిస్థితి అమిత్ షాకు బాగా తెలుసు కాబట్టి ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే సహా పార్టీ కార్యకర్తలంతా కోరుతున్నారు.  పార్టీ పరిశీలకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.