ఇక ప్రధాని పేరు ‘చౌకీదార్ నరేంద్రమోదీ’

మరోసారి ఢిల్లీ గద్దెనెక్కేందుకు విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పేరు మార్చుకున్నారు. ఒక్క మోదీయే కాకుండా బీజేపీ పరివారమంతా పేరు మార్చుకుంది. ఈరోజు ట్విట్టర్ చూసిన వారికి ఈ విషయం ఈపాటికే తెలిసుంటుంది.

‘చౌకీదార్ నరేంద్రమోదీ’ అనే కొత్త పేరుతో మోదీ ట్విట్టర్ అకౌంట్‌తో కనిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ‘చౌకీదార్ అమిత్‌షా’ అని పేరు మార్చుకున్నారు. ఇలా బీజేపీలోని చాలామంది నేతలు తమ పేరుకు ముందు ‘చౌకీదార్’ అని జత చేసుకున్నారు. 

2014లో మోదీ అధికారంలోకి రావడానికి ‘చౌకీదార్’ (కాపలాదారుడు) అనే నినాదం బాగా ఉపయోగపడింది. ‘చాయ్ వాలా’ నినాదం తర్వాత నరేంద్రమోదీని హైలైట్‌గా నిలబెట్టింది ‘చౌకీదార్’ నినాదామే. అయితే కొంత కాలంగా చాయ్ వాలా నినాదాన్ని పక్కన పెట్టారు మోదీ. ప్రతి సభలో తనను తాను చౌకీదార్‌గా ప్రచారం చేసుకుంటున్నారు.