ములాయం కుటుంభంలో సీట్లకై పోరు !

పార్టీలో తనకు ప్రాధాన్యత లభించదలేడనే ఆక్రోశంతో పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, ప్రస్తుత అధినేత అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ తనకు ఇక పార్టీతో సంబంధం లేదని, తానో సమాజవాది లౌకిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు గత వారం ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడినైన తనను అఖిలేష్ లెక్క చేయడం లేదని బాధ ఒకటైతే, వచ్చే లోక్ సభ ఎన్నికలలో తన కూడుకు ఆదిత్యను పోటీ చేయించాలని అనుకొంటే అందుకు అఖిలేష్ ఒప్పుకోనేటట్లు కనిపించడం లేదు.

ఎందుకంటె ఇప్పటికే ములాయం పరివార్ లో లోక్ సభ సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అర డజన్ మంది వరకు ఉంది, ప్రస్తుతం ఎస్పికి ఉన్న ఎంపిలు ఎడుగురైతే వారిలో ఐదుగురు ములాయం కుటుంభ సభ్యులే కావడం గమనార్హం. దానితో కొత్తగా మరెవ్వరికి సీట్ ఇచ్చే ప్రసక్తి లేదని అఖిలేష్ స్పష్టం చేస్తున్నారు. పార్టీలో బదుప్రీతికి తావు లేదంటూ కుడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

కొడుకు ఆదిత్యతో పాటు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో శివపాల్ ప్రోత్సాహంతో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన ములాయం మరో కోడలు అపర్ణ యాదవ్ సహితం ఎంపిగా పొతే చేద్దాం అనుకొంటున్నారు. ఆమె తరచు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రసంశాపుర్వకంగా మాట్లాడుతున్నారు. దానితో ఆమె బిజెపిలో చేరినా ఆశ్చర్య పడనవసరం లేదని రాజకీయ వర్గాలలో భావిస్తున్నారు.

అఖిలేష్ తానే భార్య డింపుల్ ఇప్పటికే రెండు సార్లు గెలిచి, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నుజ్ నుండి పోటీ చేస్తానని, భార్యకు సీట్ లేదని ప్రకటించారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ సీట్లు లేవని స్పష్టం చేసారు. పైగా ఇప్పుడు బిఎస్పితో పొత్తు కుదుర్చుకో బోతున్నారు. దానితో సగంకన్న తక్కువ సీట్లకే పోటీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ములాయం, డింపుల్ లతో పాటు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ లు ఎంపిలుగా ఉన్నారు. గతంలో అతి కష్టం మీద గెలుపొందిన అజంఘర్ నుండి కాకుండా ములాయం ఈ సారి మరో సురక్షిత సీట్ నుండి పోటీ చేయనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడైన తేజ్ ప్రతాప్ ను అజంఘర్ నుండి పొఏ చేయించే అవకాశం ఉంది.