రాఫెల్ అంటే 'రాహుల్ ఫెయిల్'

రాఫెల్ అంటే 'రాహుల్ ఫెయిల్' అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కొత్త అర్ధం చెప్పారు. రఫెల్ ఒప్పందాన్ని ఎన్నికల ప్రధాన అస్త్రంగా రాహుల్ గాంధీ మలుచుకోవడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ రాఫెల్ వ్యవహారం కాంగ్రెస్ చీఫ్ రాజకీయ వ్యక్తిత్వంలోని డొల్లతనాన్ని చాటుతోందని విమర్శించారు.

ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీ నుంచి హెచ్చు ధరకు రాఫెల్ యుద్ధవిమానాలను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, భారత్ లో వీటి తయారీని రక్షణ ఉత్పత్తుల నిర్మాణంలో ఎంతో అనుభవమున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని, అనిల్ అంబానీ రిలయెన్స్ డిఫెన్స్‌కు మోదీ కట్టబడి వేలకోట్ల లబ్ధి చేకూర్చారాహుల్ వద్ద తన ఆరోపణలు నిరూపించుకునే ఆధారాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఆధారాలు కానీ లేనందున పదేపదే ఆరోపణలకు దిగుతున్నారని జవదేకర్ ధ్వజమేత్తారు. ఆయన 'రాహుల్ ఫెయిల్‌'గా మారానని, ఆయన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని మండిపడ్డారు. 

కాగా, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలను పదేపదే రాహుల్ ప్రస్తావించడం సిగ్గుచేటంటూ గతంలోనూ బీజేపీ ఆయనపై మండిపడింది. రాహుల్ అబద్ధాల కోరు అని, పక్కదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారంటూ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం రాఫెల్ డీల్‌పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుండగా, రాఫెల్ జెట్స్‌ను 'గేమ్‌ఛేంజర్‌'గా భారత వైమానిక దళం అభివర్ణిస్తోంది.