సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగోయ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నీయమకంలో నెలకొన్న అనిశ్చిత తొలగింది. అందరికన్నా సీనియర్ అయిన జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నీయమకానికి రంగం సిద్దమైనది. తన వారసుడిగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపిక్‌ మిశ్రా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మిశ్రా పదవీ కాలం వచ్చే అక్టోబరు 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై ఒకరి పేరును సీజేఐ నెల రోజులు ముందుగానే న్యాయశాఖకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా జస్టిస్‌ గొగొయ్‌ పేరును ప్రతిపాదించారు.

ఇందుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందిన అనంతరం తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ నియమితులు కానున్నారు. అదే జరిగితే అక్టోబరు 3న ఆయన నూతన సీజేఐగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఏడు వారల లోగా అక్టోబర్ 17నని పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్‌ గొగొయ్‌ 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పంజాబ్‌, హరియాణా హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చేరారు.

కేసుల్ని ధర్మాసనాలకు కేటాయించడంలో సీజేఐ మిశ్రా తీరు బాగోలేదని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ ఏడాది జనవరి 12న నలుగురు న్యాయమూర్తులు విలేకరుల సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా సీజేఐ తీరును విమర్శిస్తూ నలుగురు న్యాయమూర్తులు మీడియా ఎదుటకు రావడం సంచలన సృష్టించింది.

మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగొయ్‌ కూడా ఉన్నారు. అందుచేత ప్రధాన న్యాయమూర్తి నీయమకంలో ఆయన పేరు తప్పించడం కోసం సీనియారిటీ ని పాటించక పోవచ్చానే ఊహాగానాలు కొంతకాలంగా చెలరేగుతున్నాయి. ఈ వివాదం తర్వాత కేసుల కేటాయింపు విషయంలో రోస్టర్‌ విధానాన్ని రెండు దశల్లో తీసుకొచ్చారు. రెండో విడత రోస్టర్‌ విధానం జులై రెండో వారం నుంచి అమల్లోకి వచ్చింది.