జైషే ఉగ్రవాద సంస్థలపై వాయుసేన జరిపిన దాడులకు ఆధారాలను చూపాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను పాకిస్థాన్ పోస్టర్ బాయ్స్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని దార్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ వైమానిక దాడులు పాక్‌లో నిర్వహించినప్పటికీ, భారత్‌లో కూర్చొన్న కొంతమందికి ఆ నొప్పి తగులుతున్నదని ధ్వజమెత్తారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల డెన్లోకి అడుగుపెట్టడం ద్వారా పుల్వామా దాడికి భారత్ తగిన జవాబిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ మారకపోతే, దాని పర్యవసానాలను చవిచూడాల్సి వస్తుందని ఆ దేశానికి ముందే చెప్పామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పుల్వామా ఘటనను ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘పుల్వామా ఉగ్రదాడిని ప్రమాదమని చెబుతున్న వారు ప్రపంచ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను శాంతిదూత అంటారేమో? అని అపహాస్యం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని మహా కల్తీ కూటమిగా ఆయన అభివర్ణించారు. ఈ కల్తీ కూటమిలోని నాయకులందరూ ఇక్కడ శాంతి కాముకులుగా ప్రచారం చేసుకుంటూ పాకిస్థాన్‌కు పోస్టర్ బాయిస్‌గా మారిపోయారని విమర్శించారు.
ప్రతి పని ప్రభుత్వమే చేయాలని కోరుకునే ధోరణి ప్రజల్లో పెరిగిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. సమాజాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో అత్యధిక సామాజిక కార్యక్రమాలను చేపడుతోందని ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన గాంధీ నగర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన అన్నపూర్ణ ధామ్ ఆలయంలో ప్రాణ ప్రతిప్రతిష్ఠ చేశారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని ఆశించే ధోరణి ప్రజల్లో ఈ మధ్యకాలంలో పెరిగిపోయిందన్నారు.
ఆ పనులను ప్రభుత్వం చేయకుంటే సమాధానం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి సంప్రదాయం మనది కాదన్నారు. గతంలో సమాజమే గో శాలలు, ధర్మశాలలు, చెరువులు, గ్రంథాలయాలు వంటివి నిర్మించేదన్నారు. రానురాను ఈ విధానం తగ్గిపోయి, ప్రభుత్వమే ఈ సామాజిక కార్యకలాపాలను నిర్వహించే పాత్రను స్వీకరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏం చేయాలో వివరించారు.
అమూల్ ఉద్యమం గురించి మాట్లాడుతూ భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో లేవా పటేల్ సామాజిక వర్గం మొదలు పెట్టిన ఈ ఉద్యమం కారణంగా సమాజంలోని అన్ని వర్గాలు, కులాలకు చెందిన ప్రజలు ప్రయోజనం పొందారని తెలిపారు.ప్రభుత్వం పరిపాలన సంబంధమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తే.. ప్రజలకు ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలను చేపట్టేలా సమాజం బలోపేతం కావాల్సి ఉందని చెప్పారు. సమాజాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు.
అయితే ఆయన ఒక కులానికే చెందిన నాయకుడు కాదని, ప్రపంచ నాయకుడని కొనియాడారు.ఈ సందర్భంగా ఆలయానికి ప్రతి భక్తునికి ఒక మొక్క ఇవ్వాలని, వాటిని పెంచే బాధ్యత స్వీకరించాలని మోదీ సూచించారు.