పాకిస్థాన్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్పాం

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్పామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో శనివారం విజయసంకల్ప్ దివస్‌లో భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభిస్తూ  నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన యూరీ ఘటనకు ప్రతిగా మెరుపు దాడులు జరిపిన సంగతిని గుర్తు చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా వైమానిక దాడులు జరిపి ‘బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం’ ఇచ్చామని వెల్లడించారు. 

ఈ నాలుగున్నరేళ్లలో అనేక మంది ఉగ్రవాదులను మోదీ ప్రభుత్వం ఏరి పారేసిందనని చెబుతూ ఇలాంటి ధృడమైన నిర్ణయాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకోగలరని ప్రజలకూ తెలుసని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా ప్రతిపక్ష నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం జరిపిన వైమానిక దాడులపై కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగా ల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా కొందరు సందేహాలు లేవనెత్తుతున్న అంశంపై ఆయన మండిపడ్డారు.

మీ హయాంలో సైనికులపై ఉగ్రవాదులు దాడులు జరిపితే ప్రతిదాడి చేయలేరు కానీ, ఉగ్రవాదులపై నరేంద్రమోదీ ప్రతిదాడి జరిపితే ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. చౌకబారు రాజకీయాలు చేయడానికి వైమానిక దాడులపై సందేహాలు లేవనెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ సిబ్బంది కోసం ‘వన్ ర్యాంక్ వన్ ఫెన్షన్’ నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మాణం చేసిన సంగతిని ప్రస్తావించారు. ఎన్నికలు దేశం కోసం జరగాలిదేశం కోసం ఎన్నికలు జరగాలి కానీ వ్యక్తుల కోసం కాదని షా స్పష్టం చేశారు. 

రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు భారత ప్రతిష్టను ఆకాశమెత్తుకు తీసుకెళ్లడానికి ఎన్నికలు జరగాలని షా తెలిపారు.  దేశ భద్రత కోసం, దేశంపై ఉగ్రదాడు లు జరిపిస్తున్న పాకిస్థాన్‌కు, సరైన విధంగా బుద్ది చెప్పడానికి ధృడమైన నిర్ణయాలు తీసుకోవడానికి, దేశంలోని 50 కోట్ల పేదల ఆకాంక్షల కోసం ఎన్నికలు జరగాలి కానీ, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రధానిగా చేయడం కోసం జరగరాదని షా ధ్వజమెత్తారు