పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారి కూడా పుల్వామా ఉగ్రదాడిని ఖండించలేదని, ఇక ఆయన్ను ఎలా నమ్మాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు పలికే వారిలో భయాన్ని కలగజేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ సఫలమయ్యారని వెల్లడించారు.
‘భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో మా ప్రభుత్వ ట్రాక్ రికార్డు గొప్పగా ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టాం’ అని తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడిపై ఇమ్రాన్ నిశబ్దంగా ఉండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధామిస్తూ..‘పాకిస్థాన్ ప్రధాని కనీసం ఒక్కసారైనా పుల్వామా ఉగ్రదాడిని ఖండించాల్సింది. ఆయన్ను ఇంకేం నమ్ముతాం. పరిస్థితులు ఆయన చేతిలో లేకపోయుండొచ్చు. కనీసం మాట వరసకైనా ఖండించాల్సింది’ అని ఆయనపై మండిపడ్డారు.
కొద్ది సమయంలోనే వింగ్ కమాండర్ అభినందన్‌ను వెనక్కి రప్పించే పరిస్థితులను కలగజేశామని, ఇది తమ దౌత్య విజయమని షా పేర్కొన్నారు.