పెథాయ్ నష్టం కింద ఏపీకి రూ. 82 కోట్లు

ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు కరవుసహాయం కింద అదనపు నిధులను మంజూరు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ నేతృత్వంలో సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ జాతీయ విపత్తుల నిర్వాహణ (ఎన్డీఆర్‌ఎఫ్) కింద ఏపీతో సహా 4 రాష్ట్రాలకు మొత్తం రూ.1604.15 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పెథాయ్ తుపాను నష్టం కింద రూ 82.65 కోట్ల  ఆదనపు సాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే  కొండ చరియలు విరిగిపడిన మణిపూర్‌కు రూ 42 కోట్లు,  కరవుసాయం కింద జార్ఖండ్‌కు రూ 272 కోట్లు, రాజస్థాన్‌కు రూ  1206 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 

2018-19 ఏడాదిలో వరదులు, కొండచరియలు విరిగిపడటం, పెథాయ్ తుపాను, అకాల వర్షాలు, కరవుపరిస్థితులు బారిన పడ్డ రాష్ట్రాలకు కేంద్రం ఈ సాయం ప్రకటించింది.