ఖరారైన బీజేపీ-అకాళీదళ్‌ పొత్తు


 పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాళీదళ్‌ మధ్య పొత్తు ఖరారైనట్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గురువారం ప్రకటించారు. అకాళీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌తో సమావేశానంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. 

2014లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 13లోక్‌సభ స్థానాలున్న పంజాబ్‌లో అకాళీదళ్‌ 10 స్థానాల్లో పోటీ చేయనుండగా, బీజేపీ మూడు సీట్లలో అభ్యర్థులను బరిలో నిలపనుంది. 2014లోనూ అకాళీదళ్‌ 10 స్థానాల్లో పోటీ చేయగా మూడు స్థానాల్లో గెలుపొందింది. 

బిజెపి మూడు సీట్లలో పోటీ చేసి రెండు స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపునకు కావాల్సిన అన్ని మార్గాలను బీజేపీ అన్వేషిస్తోంది. అందులో భాగంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. అలాగే పాత మిత్రులను కూటమిలో చేర్చుకుంటున్నారు. 

ఇటీవల తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంతో పాటు మహారాష్ట్రాలో ఎడమొఖం పెడముఖంగా ఉన్న శివసేనతో కూడా పొత్తును ఖరారు చేసుకోవడం తెలిసిందే. బీహార్ లో కూడా సూత్రప్రాయంగా పొత్తు ఖరారైనది.