10 లక్షల కోట్ల డాలర్లుగా భారత ఆర్ధిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థను 10 లక్షల కోట్ల డాలర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దీంతో ప్రపంచంలోమూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నదని ఎకనమిక్ టైమ్స్ ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నది. 

దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పుంజుకుంటున్నదని, ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. వీటికితోడు రెండంకెల స్థాయిలో దూసుకుపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగామని, ద్రవ్యలోటును అంచనాలకుమించి తగ్గించగలిగామని తెలిపారు. గడిచిన నాలుగున్నరేండ్లలో సంస్కరణలు తీసుకురావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దశ దిశ మారిపోయిందని, ముఖ్యంగా వృద్ధిరేటు సరాసరిగా 7.4 శాతం స్థాయిలో ఉండగా, ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గించామని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. 

ప్రతిష్ఠాత్మకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తీసుకురావడంతో వృద్ధి మరింత పరుగులు పెట్టిందని ప్రధాని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో లెక్కలేనన్నీ అభివృద్ధి కార్యక్షికమాలు జరిగాయని.. స్టార్టప్‌లోనూ, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలోనూ, విద్యుత్‌తో నడిచే వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. 

యూపీఏ పరిపాలనలో అవినీతిలోనూ, మంత్రుల్లోనూ, వ్యక్తిగతంగాను, ఆలస్యంమవడంలోనూ, బొగ్గు, స్పెక్ట్రం, కామన్ గేమ్స్, రక్షణ రంగ ఒప్పందాల్లో పోటీ పడగా..ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధిలో పోటీపడ్డామ ని ప్రధాని వెల్లడించారు. అవినీతి రహిత భారతావనిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న