కుల వివక్ష అంతం కాకపోవడం పట్ల ప్రధాని విచారం

ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పటివరకూ కుల వివక్ష అంతం కాకపోవడం విచారకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువత సహకారంతో వివక్షను రూపుమాపి నవ భారతాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. కుల వివక్షను అంతం చేయడానికి గురు రవిదాస్ కృషి చేశారని ప్రధాని మోదీ తెలిపారు.  సమాజంలో సామరస్యానికి, సమానత్వానికి అవరోధంగా నిలుస్తున్న కుల వివక్షను రూపుమాపాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో 15వ శతాబ్దంలో జన్మించిన గురు రవిదాస్ కుల సమస్యను పరిష్కరించడానికి తన బోధనల ద్వారా ప్రయత్నించారని చెప్పారు.  కుల వివక్ష కారణంగా ప్రజల మధ్య సత్సంబంధాలు కొరవడుతాయని తెలిపారు. తద్వారా సామాజిక సామరస్యం సాధించ లేమని స్పష్టం చేశారు.

 తమ ప్రభుత్వం కూడా రవిదాస్ బోధనల ప్రకారం నాలుగున్నరేళ్లుగా ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ లక్ష్యంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా ‘పంచధర్మ’ (విద్య, ఆదాయం, ఔషధం, నీటిపారుదల, ప్రజా సమస్యల పరిష్కారం) అమలు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 

అయితే ఇప్పటికీ కూడా కుల వివక్షను అంతం కాకపోవడం విచారకరమన్నారు. యువత సహకారంతో కుల వివక్ష అంతం కోసం కృషి చేస్తామని, నవ భారతాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సంద ర్భంగా స్వప్రయోజనాల కో సం కుల వివక్షను ప్రోత్సహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత అవినీతిరహితంగా పాలించామన్నారు. ఈ సం దర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రధాని మోదీని ‘కాశీపుత్ర’ లేదా వారణాసి కుమారుడు అని సంబోధించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ.. రూ. 3 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.