గృహనిర్బంధంలో వరవరరావు

విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి సెప్టెంబర్‌ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచనున్నారు. ప్రధాని హత్యకు కుట్ర రచన, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వరవరరావుపై ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై వరవరరావును ఇట్లో సోదాలు జరిపిన తర్వాత మూడు రోజుల క్రితం పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వరవరరావునేగాక దేశంలోని మొత్తం 5గురు ఉద్యమకారులను కూడా అరెస్టు చేశారు.

వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల నేతలు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరహక్కుల కార్యకర్తలను కారాగారంలో పెట్టొద్దని గృహనిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరవరరావును పుణె నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.