అసోంను..మరో కశ్మీర్ కానియ్యం : అమిత్ షా

అసోంను మరో కశ్మీర్‌ను కానీయమని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలోని లఖింపూర్ లో బీజేవైఎం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ బిల్లు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాగానే ఈ బిల్లుకు చట్టబద్దత కల్పిస్తామని ప్రకటించారు. ఈ బిల్లు కారణంగా అసోం జనాభాలో మార్పు వస్తుందని లేని పక్షంలో అసోం ప్రజలు ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరించారు.

అసోంలో బీజేవైఎం నిర్వహించిన సభలో మాట్ లాడుతూ చొరబాటు గుర్తించడానికే.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) తీసుకొచ్చామని తెలిపారు. ఎన్‌ఆర్‌సీ అమలు చేయకుంటే అసోం మరో కశ్మీర్‌గా మారే ప్రమాదముందని హెచ్చరించారు.  అసోంను మరో కశ్మీర్ కానివ్వము. అందుకుఏ ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను ఎన్నిసార్లునా చేపడుతామని వెల్లడించాహ్రూ. 

విదేశాల నుంచి వచ్చి.. అసోంలో తలదాచుకున్న అక్రమ చొరబాటుదారులను తరిమికొట్టే వరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, అసోం గణపరిషత్‌పై విమర్శలు గుప్పించారు. పౌరసత్వ బిల్లు కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.

పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా పక్కదేశాల్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న భారతీయులకు పౌరసత్వం కల్పించడానికి మార్గం సుగమం చేస్తున్నామని ప్రకటించారు. పౌరసత్వ సవరణ కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. కొన్ని పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

అయితే వ్యతిరేకించిన ఆ పార్టీలు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతిని అమిత్ షా గుర్తు చేశారు.దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

దేశభద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రస్తకే లేదని షా స్పష్టం చేశారు. ‘ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదు. ఆ పార్టీ మాధిరిగా దేశభద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడము.’ అని ఆయన పేర్కొన్నారు.

పుల్వామాలో జరిగిన దాడి పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. పాక్ మద్దతుతో ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉగ్రదాడి కారణంగా అమరులైన జవాన్ల త్యాగం వృథా కాదని చెబుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా బలమైన వాదాన్ని విన్పిస్తున్నారని తెలిపారు. దౌత్యపరంగా అన్ని అవకాశాల ద్వారా ఇప్పటికే పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టామని చెప్పారు.