పాక్‌కు ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరణ

మన పొరుగున ఉన్న టెర్రరిస్టు దేశమైన పాకిస్థాన్‌కు ‘మోస్ట్ ఫ్యావర్‌డ్ నేషన్’ (ఎంఎఫ్ఎన్) హోదాను విత్ డ్రా చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భద్రత వ్యవహారాలపై మంత్రివర్గ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పుల్వామా దాడి నేపథ్యంలోతలెత్తిన పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పుల్వామాలో తీవ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ జవాన్లు మరణించిన నేపథ్యంలో ‘అత్యంత అభిమాన దేశం’ హోదాను ఉపసంహరించుకున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మల సీతారామన్, రాజనాథ్ సింగ్, జైట్లీ తదితరులు పాల్గొన్నారు.

 ప్రపంచ వేదికపై పాక్‌ను ఏకాకి చేయడానికి విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకోనుంది. ఈ దారుణ ఘటన వెనక పాక్‌ హస్తమున్నట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జైట్లీ తెలిపారు. సైనికులపై దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ ఘటనపై శనివారం అఖిలపక్షం నిర్వహిస్తామని వెల్లడించారు. 

‘అత్యంత అభిమాన దేశం’ హోదా వల్ల అంతర్జాతీయ వర్తకంలో ఆయా దేశాలకు కొన్ని హక్కులుంటాయి. 996లో భారత్ పాకిస్థాన్ కు ఈ హోదా కల్పించింది. అయితే భారత్ కు పాకిస్థాన్ అటువంటి హోదా కల్పించలేదు. ఈ హోదాను పసంహరించడంతో రెండు దేశాల జరిగే వాణిజ్యంపై సుంకాలను భారత్ పెంచే అవకాశం ఏర్పడింది.

కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శ్రీనగర్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. పుల్వామాలో మరణించిన జవాన్ల మృతదేహాలను విమానాల ద్వారా వారి కుటుంబసభ్యులకు చేరవేయాలని నిర్ణయించారు.