మోదీయే ప్రధాని.. ప్రశాంత్ కిశోర్‌ జోస్యం

మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండరని పేర్కొన్నారు.

‘ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారం కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న విషయాన్ని మాత్రం నేను అంచనా వేయలేను. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి ప్రభావాలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై అంతగా ప్రభావం చూపవని భావిస్తున్నాను’ అని తెలిపారు.

బిజెపికి పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీశ్‌ అభ్యర్థిత్వం సాధ్యం కాకపోవచ్చునని తెలిపారు. ‘‘నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేలో ఒక పెద్ద నేత. బిహార్‌ లాంటి రాష్ట్రాన్ని 15 ఏళ్ల పాటు పాలించిన ఘనత ఆయనకు ఉంది. అయితే ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయనను ఊహించుకోవడం సమంజసం కాదు. నరేంద్ర మోదీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి. రానున్న ఎన్నికల్లో గెలిచి.. మోదీ తిరిగి ప్రధాని పదవి చేపడతారు’’ అని ప్రశాంత్‌ వివరించారు.

ఇలా ఉండగా, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అంతగా ప్రభావితం చేసే అంశం ఏమీకాదని కిషోర్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే ఆ రాష్ట్రంలో ఈ ప్రభావం బాగా పడేదని చెప్పారు. కానీ, లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకమైనవని వ్యాఖ్యానించారు. ‘ఎవరివద్దా మంత్రదండం లేదు. లోక్‌సభ ఎన్నిలకు రెండు-మూడు నెలల మ