ఢిల్లీ హోటల్ లో అగ్నిప్రమాదం... 17 మంది మృతి

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు.  షార్ట్‌సర్కూట్‌ వల్లే హోటల్‌ అర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లే నార్త్‌ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. మంటల కారణంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరాడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ  అధికారి తెలిపారు.

అక్టోబరు 2005న హోటల్‌కు లైసెన్స్‌ ఇవ్వగా, గతేడాది దాని గడువును పొడిగించారు‌. ‘ప్రమాద స్థలం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఉదయం 3.30గంటల సమయంలో రెండో అంతస్తులో షార్ట్‌సర్కూట్‌ జరిగింది. దీంతో మంటలు చెలరేగి హోటల్‌ మొత్తం వ్యాపించాయి’ అని ఎన్‌డీఎంసీ అధికారి తెలిపారు.

హోటల్‌లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఘటనా స్థలాన్ని దిల్లీ హోంశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ పరిశీలించారు. దీనిపై న్యాయపరమైన విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన వెల్లడించారు.

‘అర్పిత్‌ హోటల్‌లో నాలుగు అంతస్తులు నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఆరు అంతస్తులు నిర్మించారు. టెర్రస్‌ మీద టేబుల్స్‌, కుర్చీలు వేసి దాన్ని మరో గదిగా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలని అధికారులను ఆదేశించాను. ఈ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారు’ అని మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు.

ఈ ప్రమాదం దృష్ట్యా దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన