ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడట్లేదు... ఎప్పుడైనా కూలిపోవచ్చు !

తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కనబడటం లేదని జేడీఎస్‌ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. మరోకొద్దీ సేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టవలసి ఉండగా ఆయన ఈ ఆరోపణ చేయడం గమనార్హం. తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోబాలకు గురిచేస్తున్నారని పేర్కొంటూ ఓ ఎమ్మెల్యేకు డబ్బు ఎరవేస్తున్న అంశంపై ఆడియో టేపును కర్ణాటక సీఎం విడుదల చేశారు.

ఇలా ఉండగా, ఏ క్షణంలోనైనా ప్రభుత్వానికి పతనం తప్పదని, ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభాలకు లొంగరాదని బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పార్టీ ఎమ్యెల్యేలకు హితవు పలికారు. పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘ మంతనాలు జరుపుతూ ఎమ్మెల్యేలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, ప్రలోభాలకు లొంగరాదని సూచించారు. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలు కలసి వస్తున్నాయని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలోనే వారి బలం తేటతెల్లమైందని పేర్కొన్నారు. సీఎం కుమారస్వామిపై ఎవరికీ విశ్వాసం లేదని ఏ క్షణంలోనైనా ప్రభుత్వం కూలిపోవచ్చుని స్పష్టం చేసారు. 

కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గవర్నర్‌ అవకాశమివ్వడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అయితే శాసనసభలో ఆయన బలనిరూపణ చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా అధికార కూటమి ఆరోపిస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో కు