మూకదాడులకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ!

దేశ రాజధాని ఢిల్లీలోని ఐటిఒ ప్రాంతంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఫోటోతో కూడిన ఓ పెద్ద పోస్టరన్‌ను ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిథి తాజేందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ఏర్పాటు చేయడం సంచలనం కలిగిస్తున్నది.  ఆ పోస్టర్‌లో 'మూకదాడులకు పిత'గా ఆయనను అభివర్ణించారు. 1984లో సిక్కులకు వ్యతిరేక అల్లర్లలో తమ పార్లీ పాల్గనలేదని కాంగ్రెస్‌ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ పేర్కొన్న నేపథ్యంలో తాజేందర్‌ ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.

'1984 అల్లర్ల గురించి రాహుల్‌గాంధీ చెప్పిన అనంతరం, ఆయనకు చరిత్ర పాఠాన్ని గుర్తుచేయాలి' అని తాజేందర్‌ వ్యాఖ్యానించారు. '1984లో ఆయన తండ్రి ఊచకోతకు దర్శకత్వం వహించారు. ఇప్పటికి పార్టీలో సీనియర్‌ నాయకులు కూడా ఇందులో పాత్రధారులే. కాబట్టి ఇటువంటి ప్రకటనలు రాహుల్‌ ఎలా చేయగలడు' అని ప్రశ్నించారు.

2014 అనంతరం ఏ ఘటననైనా మాబ్‌లించింగ్‌ అనే కొత్తపదం కాంగ్రెస్‌ ఉపయోగిస్తుందని, కానీ దీనిని రాజీవ్‌గాంధీ ప్రారంభించారని ఆరోపించారు. కాగా, దీనిపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిథి శర్మిష్టా ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిని చెత్త రాజకీయంగా పేర్కొన్నారు. ఇటువంటి పోస్టర్లను బిజెపి నిషేధించినప్పటికీ, పార్టీ నేతలు తాజేందర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు.