మైనారిటీ వోట్లకై చంద్రబాబు గురి

ఎన్డియే నుండి వైదొలగిన తర్వాత తెలుగు దేశం పార్టీ, ప్రభుత్వ గ్రాప్ పడిపోతూ ఉండటం, పలు వరాలు వరుసగా పార్టీకి దూరం అవుతూ ఉండడంతో నష్ట నివారణ చర్యగా మైనారిటీలను దగ్గరకు తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ కసరత్తు చేపట్టారు. నాలుగేళ్ళుగా ఒక్క మైనారిటీకి కుడా కీలక పదవి ఇవ్వని టిడిపి అధినేత నంద్యాల ఉపఎన్నికలలో గెలుపు కోసం సీనియర్ పార్టీ నాయకుడు మొహమ్మద్ ఫరూక్ ను గుర్తించి ఎమ్యేల్సి పదవితో పాటు శాసన మండలి చైర్మన్ గా చేసారు. ఇప్పుడు గుంటూరు లో ` నారా హమారా... టీడీపీ హమారా’ పేరుతో పెద్ద ఎత్తున మైనారిటీ లను

గోద్రా సంఘటన జరిగాక గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని అప్పుడు డిమాండ్‌ చేసింది దేశం మొత్తం మీద తమ పార్టీ ఒక్కటే అంటూ ఇప్పుడు అసలు రంగు బైట పెట్టుకున్నారు. పైగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌పై ఓ చట్టం తెస్తామంటే అడ్డుకొంటున్నది కుడా తానే అంటూ ఘనంగా చెప్పుకొచ్చారు.

సమీకరించి, బహిరంగ సభ జరిపి వారికి తానే రక్షకుడిని అంటూ ప్రకటనలు చేసారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న తరుణంలో మైనారిటీలకు తన మంత్రివర్గంలో స్థానం ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల నుండి పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చి మరీ బస్సులలో జనాలను తరలించారు. ఈ సందర్భంగా ముస్లింలపై వరాల జల్లు కురిపించారు.

ఇప్పటికే ఎస్సి, ఎస్టి లకు అమలు చేస్తున్న `ప్రత్యేక ప్రణాళిక నిధులు’ ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తున్నాయో తెలియదు గాని ఇప్పుడు కొత్తగా ముస్లిం లకు కుడా `ప్రత్యేక ప్రణాళిక నిధులు’ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వచ్చేడిది ఎన్నికల ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టె అవకాశం లేకపోవడంతో ఇక వచ్చే ఎన్నికలలో గెలిస్తేనే ఈ హామీని అమలు జరిపే ప్రయత్నం చేయవలసి ఉంటుంది.

‘వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలుచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటాం. ముస్లింలపై మూకదాడులు జరగకుండా రక్షణ కల్పించడంతోపాటు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి అండగా ఉంటాం’ అని భరోసానిచ్చారు. పైగా, కేంద్రంపై చేస్తున్న `ధర్మపోరాటం’లో ముస్లింలు అండగా ఉండాలని, పోరాటానికి సిద్ధం కావాలని పిలిపిస్తూ వచ్చే ఎన్నికలలో టిడిపికి వోట్ వేస్తేనే ఇవ్వన్ని సాధ్యం అన్నట్లు చెప్పారు. ఎందుకంటె ఆయన దృష్టిలో వైసిపి, జనసేనలకు ఓటేస్తే ఎన్డీయేకు వేసినట్లే అట.

‘ఇది పోరాట సభ, కుట్రదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సభ’ అంటూ వ్యాఖ్యానించారు. ఎవ్వరి మీద, ఎందుకోసం పోరాటం చేతున్నారు ? కుట్ర దారులేవ్వరు ? రానున్న ఎన్నికలలో తనను గట్టించేటట్లు చేసుకోవడం కోసం అకస్మాత్తుగా మైనారిటీలపై ప్రేమ చూపుతున్నది ఎవ్వరు ?