మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని... గడ్కరీ జోస్యం

ప్రధాని మళ్లీ నరేంద్ర మోదీనే పదవిని అధిష్టించబోతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు. మోదీని తిరిగి ప్రధాన మంత్రిని చేయడం కోసం కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  హైదరాబాద్ లో  జరిగిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల క్లస్టర్ సమావేశంలో శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఉద్దేశించి గడ్కరీ  ప్రసంగిస్తూ మొన్న తెలంగాణలో రాష్ట్ర ఎన్నికలు జరుగగా ఇప్పుడు ఢిల్లీ లో ఎవరుండాలి అన్న అంశంపై ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు 

దేశంలో బలమైన, పటిష్టమైన ప్రభుత్వం కావాలా, కిచిడీ ప్రభుత్వం కావాలా అంటే బలమైన ప్రభుత్వం కావాలని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆత్మవిశ్వాసం తో వెళ్ళండి తెలంగాణా లో ప్రజలు బీజేపీ ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ప్రజలను కన్ఫ్యూజ్ చేసే రాజకీయాలు జరుగుతాయి..జాగ్రతగా ఉందాలని సూచించారు.

ప్రతిపక్షాలు.. మోడీ కి వ్యతిరేకంగా ఒక్కటి అయ్యాయి.. దేశం మీద ప్రేమతో కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి నినాదం మీద ఎన్నికలు జరగకుండా... చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కార్యకర్తలు గూడ్స్ రైలుకు ఇంజిన్ లాంటి వారని అంటూ మరోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 

ప్రాంత, భాష, జాతి, ధర్మం బేధము లేకుండా పరిపాలన సాగిస్తున్నామని చెబుతూ అందుకే ఆర్ధిక వివక్ష లేకుండా ఆర్ధికంగా వెనకబడిన వర్గాల కు పది శాతం.. రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. తప్పుడు పనులు చేస్తేనే కాదు,  మంచి అభివృద్ధి పనులు చేసి కూడా అంతకన్నా ఎక్కువ శత్రువులు పెరుగుతారని అర్థం అయిందని పేర్కొన్నారు. మేము చేసిన అభివృద్ధిని ప్రశ్నించలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 

మోదీ ముస్లిమ్స్ ని పాకిస్థాన్ పంపిస్తారని ప్రచారం చేశారని, దళిత ఆదివాసీల కు బీజేపీ మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేశారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు, కాంగ్రెస్ దోస్తిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఒకరికొకరు నమస్కారం చేసుకోలేని, మొహం కూడా చేసుకోలేని వారు కూటమి కడుతున్నారని ఎద్దేవా చేశారు. 

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిలో దేశ ముఖ చిత్రమే మారిపోయిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందులోభాగంగానే 55 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో జరిగిందని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కేంద్రం చేసిన అభివృద్ధి కనబడుతుందని చెప్పారు. డీపీఆర్ లేకున్నా.. నీటి సమస్య పరిష్కారం కోసం కాళేశ్వరం ప్యాజెక్టుకు కేవలం వారం రోజుల్లో అనుమతులిచ్చామని గుర్తు చేశారు. 

కేవలం ఎన్నికల్లో గెలవడమొక్కటే కాదని చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, మళ్ళీ గెలిపించాలని కోరాలని సూచించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కచ్చితంగా ఆదరిస్తారని మెజారిటి సీట్లలో గెలుస్తామని అన్నారు. వచ్చే మంత్రివర్గంలో తెలంగాణ కు స్తానముంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఆంద్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టును 100 శాతం నిధులను కేంద్రమే ఇచ్చిందని వెల్లడించారు. హిమాలయాలకు దూరంగా ఉన్న రాష్ట్రాల్లో.. నీటి సమస్య ఎక్కువ కాబట్టే మోదీ వచ్చాక ప్రధాని సించాయ్ యోజన లో.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర లో ప్రాజెక్టులు అనుమతి ఇచ్చామని చెప్పారు. అనుమతిచ్చిన  ప్రాజెక్ట్‌లలో 66 ప్రాజెక్టులు.. ఈ జూన్ లో ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. 

ఆంధ్ర, తెలంగాణ.. 45 టీఎంసీ ల నీళ్ల విషయంలో.. నల్లా దగ్గర.. మహిళల లాగా సెక్రటరీ, మంత్రులు జగడం పెట్టుకోవడం చూసామని చెప్పారు. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ ల మధ్య కాళేశ్వరం ప్రొజెక్ట్ కోసం.. సీఎం కేసీఆర్..తన దగ్గర వచ్చారని తెలిపారు కేవలం 8 రోజుల్లో.. తెలంగాణ నీళ్ల కోసం.. మంజూరులు ఇచ్చామని తెలిపారు.