తీర్మాన ప్రతులను చింపేసిన బీజేపీ ఎమ్మెల్సీలు

ఏపీకి విభజన హామీలు అమలు చేసి, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ, శాసనమండలిలో శుక్రవారం తీర్మానం చేశారు.  అయితే ఈ తీర్మాన ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపేశారు. దీంతో అటు అసెంబ్లీలో.. ఇటు మండలిలో టీడీపీ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు మారిపోయాయి.

మండలిలో చర్చ సందర్భంగా ప్రత్యేక హోదాకు చంద్రబాబే అడ్డం పడ్డారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ధ్వజమెత్తారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఆనాడు హోదాకు బదులు ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మాధవ్  స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి సహకరిస్తున్నా.. తమపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. 

లోపభూయిష్టమైన తీర్మాన కాపీలను మాత్రమేగా ఆరోపిస్తూ చింపేసినట్లు మాధవ్ స్పష్టం చేశారు. పోలవరం గూర్చి మాట్లాడే హక్కు ఏపీ చంద్రబాబుకు లేదని మాధవ్ స్పష్టం చేశారు. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం లేదన్నారు.  

పోలవరం భాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు అంచనాలు పెరిగాయి. దీనిపై మాట్లాడం శోచనీయం. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంత నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో రైల్వే జోన్ విషయంలో సహకారం లభించలేదు. మంగళగిరి ఎయిమ్స్‌లో త్వరలో ఓపీ స్టార్ట్ అవుతుంది" అని తెలిపారు. 

ఈ రోజు తీర్మానం తాము బహిష్కరిస్తున్నామని చెబుతూ టీడీపీ వారు మాపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తీవ్రమైన పదజాలం వాడారని చెబుతూ  వాటిని తీవ్రం ఖండించారు. ప్రధాన మంత్రి కిసాన్ ఫండ్ అనేది ఒక వరంగా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఫండ్ పెంచాం. ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు చేసాం. బీజీపీ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపించిందని కొనియాడారు.