కరుణానిధి సంస్మరణ సభకు అమిత్ షా దూరం

ఈ నెల 30న చెన్నయిలో డిఎంకె ఆదర్యంలోజరుగుతున్న దిగవంత ముఖ్యమంత్రి యం కరుణానిధి సంస్మరణ సభకు బిజెపి అద్యక్షుడు అమిత్ షా హాజరు కావడం లేదు. గత వారం మాజీ కేంద్ర మంత్రి టి బాలు, కరుణానిధి కుమార్తె కనిమోజి వచ్చి స్వయంగా ఆవహించడంతో ఆయన హాజరు కావడానికి అంగీకరించారు. అయితే ఆయన హాజరు కావడంతో డిఎంకె, బిజెపి రాజకీయంగా దగ్గర అవుతున్నట్లు, పొత్తు కుడా పెట్టుకొనే అవకాశం ఉన్నదని కధనాలు వెలువడడంతో అమిత్ షా హాజరు కారాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పుడు తన ప్రతినిధులుగా సీనియర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి, బిజెపి తమిళ్ నాడు ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు లను ఆయన పంపుతున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మూడు రోజుల ముందుగా చెన్నయిలో దిగవంత ప్రధాన మంత్రి వాజపేయి సంస్మరణ సభను రాష్ట్ర బిజెపి జరుపుతున్నది. ఈ కార్యక్రమంలో డిఎంకె ప్రతినిధిగా కనిమోజి పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కుడా హాజరవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పలనిస్వామి గాని, డిఎంకె అధినేత స్టాలిన్ గాని హాజరు కాకపోవడం గమనార్హం.

డిఎంకెతో రాజకీయంగా దగ్గర కావడం పట్ల బిజెపి వర్గాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకనే అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల తమకు సమాచారం లేదంటూ రాష్ట్ర పార్టీ నాయకులు ముక్తసరిగా స్పందించారు.