వరవరరావు ఇంట్లో పోలీస్ ల సోదాలు

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టారు. మోడీని హత్య చేసేందుకు కుట్ర కేసులో వరవరరావు పేరు ఉండడంతో హైదరాబాద్ లోని గాంధీనగర్‌లోని వరవరరావు ఇంటితో సహా హైదరాబాద్‌లో 4 చోట్ల మంగళవారం ఉదయం నుంచి పుణ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

వరవరరావు ఇంటితో పాటు నాగోల్‌లో ఉంటున్నబిజినెస్‌ లైన్‌ రిపోర్టర్‌ కూర్మనాథ్‌, వరవరరావు చిన్న కూతురు ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర చేసినట్లు పుణ పోలీసులు బయటపెట్టారు. కుట్రలో వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌కు నిధులు వరవరరావు సమకూర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి, లోపలినుంచి తాళాలు వేయించి సోదాలు నిర్వహిస్తున్నారు.