ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం చోరువ !

నాలుగేళ్ళుగా అపరిష్కృతంగా ఉండిపోయిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి న్యాయసంబంధ అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చోరువ తెసుకొంటున్నది.  ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే కొత్త కోర్టు ఏర్పాటు చేయాలని మూడేళ్ళ క్రితం సుప్రేం కోర్ట్ తీర్పు ఇవ్వడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగిన వసతి చూపక పోతూ ఉండడంతో హై కోర్ట్ విభజన వాయిదా పడుతూ వస్తున్నది.

అయితే ఇప్పుడు సుప్రేం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పెటిషణ్ ను దాఖలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కీలకమైన అడుగు వేసింది. కొత్తకోర్టు ఏర్పాటుకు ఉన్నత న్యాయస్థానం తీర్పు అవరోధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉమ్మడి హైకోర్టులే నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటి వరకు కేంద్రం చెబుతూ వచ్చింది. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడానికి ఓ వైపు జాప్యం జరుగుతుండగా న్యాయస్థానం విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒత్తిడి తీసుకువస్తున్నారు.  మరోవంక, తాత్కాలిక భావన నిర్మాణం జరుపుతున్నామని అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు.  

ఈ నేపథ్యంలో ఉమ్మడి న్యాయస్థానాన్ని విభజించి తెలంగాణలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఉద్దేశం కావచ్చని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకు కేసిర్ సహితం గతంలో సుముఖత వ్యక్తం చేసారు. ప్రస్తుత హై కోర్ట్ ప్రాంగణంలోనే రెండు తెలుగు రాష్త్రాల హై కోర్ట్ లను ఏర్పాటు చేయడం గాని, లేదా ప్రస్తుత భవనాలను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ కు కేటాయించి, తాము నగరంలో మరో భవనంలో తెలంగాణ హై కోర్ట్ ను ఏర్పాటు చేసుకోవడం గాని చేయడానికి సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేసారు.

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ధనగోపాలరావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఉమ్మడి హైకోర్టు 2015 మే 1న తీర్పు వెలువరిస్తూ తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఏపీ భూభాగంలోనే హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని, తాత్కాలిక ప్రాతిపదికన సర్క్యూట్‌ బెంచ్‌ల ఏర్పాటును పరిశీలించవచ్చని కేంద్రానికి సూచించింది.

ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరస్పరం చర్చించుకుని హైకోర్టు భవనం, పరిపాలనా భవనం, న్యాయమూర్తుల నివాసాలు, సిబ్బంది గృహ సముదాయాలు నిర్మాణాలకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించింది. ఆ తర్వాత హైకోర్టు విభజన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా హైకోర్టు, ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైనే ఆధారపడి ఉందంటూ కేంద్రం చెబుతూ వచ్చింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన దరిమిలా తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసే పరిస్థితికు మార్గం సుగమం అయిన్నట్లే నని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో సుప్రీం కోర్టు వైఖరే కీలకం కానుంది. ఎస్‌ఎల్‌పీపై అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ ఈనెల 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. ధర్మాసనంఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఎల్‌పీ ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.

మరోవంక, అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం నవంబరులోగా పూర్తవుతుందని, దీనికి సంబంధించి కంప్యూటర్లు, ఇంటీరియర్‌ అవసరాలు ఏమిటో చెబితే వాటిని సమకూరుస్తామని ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాసింది. ఏర్పాట్లన్నీ డిసెంబరులోగా పూర్తవుతాయని, జనవరి 1 నుండి కొత్త భవనంలో ఎపి హై కోర్ట్ పనిచేసే వీలుంటుందని కుడా చంద్రబాబునాయుడు స్పష్టం చేసారు. ఈ లేఖపై హైకోర్టు స్పందిస్తూ భవనాలు, ఏర్పాట్ల పరిశీలనకు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కమిటీని నియమించింది.

ఈ పరిస్థితులలో మరో నాలుగు నెలలు వేచి ఉండకుండా ఇప్పుడే హైదరాబాద్ లో రెండు హై కోర్ట్ లు ఉండే విధంగా ఉమ్మడి హై కోర్ట్ విభజనకు సుప్రేం కోర్ట్ సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉండక పోవచ్చని మరొకొందరు భావిస్తున్నారు.