బీజేపీలో చేరిన బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్

బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఇషా కొప్పికర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ కండువా అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

‘ఖల్లాస్‌ గాల్‌’గా పాపులరయిన ఇషా కొప్పీకర్‌ 1998లో తమిళ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. 2000 సంవత్సరంలో ‘ఫైజా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కంపెనీ, దిల్‌ కా రిష్తా, ఖాయామత్‌, తుజే మేరీ కసమ్‌, హమ్‌ హమ్‌, క్యా కూల్‌ హై హమ్‌, మైనే ప్యార్‌ కౌన్‌ కియా, 36 చైనా గేట్‌ తదితర సినిమాల్లో నటించారు. 

తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో కనిపించారు. కన్నడ, మరాఠీ సినిమాల్లోనూ ఆమె నటించారు. 2009, నవంబర్‌ 29న వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది.