దక్షిణాదిన 50 సీట్లకై బిజెపి వ్యూహం !

రానున్న లోక్ సభ ఎన్నికలలో దక్షిణాది రాస్త్రాలలో సుమారు 50 సీట్లను గెలువపందాలని బిజెపి నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. 2014 ఎన్నికలలో లభించిహ్న సీట్లకన్నా దాదాపు రెట్టింపు సీట్లు అన్నమాట. హిందీ రాస్త్రాలలో తగ్గగలవాని భావిస్తున్న సీట్లను పశ్చిమ బెంగాల్, ఒడిశా లతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో భర్తీ చేసుకోవాలని గత మూడేళ్ళుగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుతం దక్షిణాదిన నెలకొన్న రాజకీయ పరిస్థితులు బిజెపికి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. బీజేపీ అంచనాల ప్రకారం కర్ణాటకలో మొత్తం 28 సీట్లలో 25 సీట్లను, ఆంధ్ర ప్రదేశ్, కేరళలో 5 నుండి 7 సీట్ల చొప్పున, తమిళ నాడులో 10 సీట్ల వరకు గెల్చుకొనే ప్రయత్నం చేస్తున్నది. 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా గెలుపొంది, మెజారిటీకి ఏడెనిమిది సీట్లకు తక్కువ మాత్రమే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోవడం ఒక విధంగా ఇప్పుడు మేలు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారమలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని లొసుగులు బీజేపీ పట్ల వరప్రసాదంగా మారనున్నాయి. 

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బి ఎస్ యడ్డ్యూరప్ప రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటనలు జరుపుతూ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పనిచేసిన పార్టీ యంత్రంగం ఇంకా పటిష్టంగా ఉండటం కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే  ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ లను నియమించారు. గెలుపు కోసం ప్రస్తుత ఎంపీలలో కొందరికి సీట్లు రాకపోవచ్చని తెలుస్తున్నది.

కర్ణాకటలో ప్రజాదరణతో యడ్డ్యూరప్పతో పోటీ పడగల నేత మరో పార్టీలో లేరు. ఆయనకు బలమైన లింగాయత్ లలో మంచి పలుకుబడి ఉండడంతో పాటు వొకలింగాలు, కుర్బాలు, బ్రాహ్మినులు, ఓబిసి, ఎస్సిలలో సహితం మంచి పట్టు ఏర్పడింది.  

కేరళలో శబరిమల వివాదం బీజేపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల పరిస్థితులు నెలకొనేటట్లు చేస్తున్నాయి. తిరువనంతపురం, త్రిసూర్, పాలక్కాడ్, అత్తింగాళ్ వంటి నియోజకవర్గాలలో మంచి పట్టు ఏర్పడింది. 5 నుండి 7 స్థానాలలో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 సీట్లు ఉన్నాయి. 

ఇక దక్షిణాదిన అత్యధికంగా 39 సీట్లు ఉన్న తమిళనాడు పట్ల బిజెపి ప్రత్యేక వ్యూహం అనుసరిస్తుంది. గత ఎన్నికలలో పీఎంకే, ఎండీఎంకే వంటి పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి బిజెపి, పీఎంకే చేరి ఒక సీట్ లలో గెలుపొందారు. ఈ పర్యాయం అన్నాడీఎంకే చివరకు బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. అన్నాడీఎంకే లోని రెండు వైరి వర్గాలను దరిచేర్చి, ప్రభుత్వం సుస్థిరంగా ఉండేటట్లు చేయడంలో బీజేపీ కీలక పాత్ర వహించింది. 

అన్నాడీఎంకేతో పాటు మరి కొన్ని చిన్న చిన్న  పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి 10కి పైగా సీట్లు గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు, కేరళలో కలిపి 59 లోక్ సభ సీట్లు ఉన్నాయి. వీటిల్లో మూడోవంతు సీట్లపై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు. 

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 1999 నాటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నట్లు బిజెపి నేతలు భావిస్తున్నారు. ఆ ఎన్నికలలో వాజపేయి ప్రభావంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి సొంతంగా 7 లోక్ సభ స్థానాలను గెలుపొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల ప్రజలలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి నాయకత్వం ప్రయత్నం చేస్తున్నది. 

జనవరి 1 నుండి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేబడుతున్న బస్సు యాత్ర ద్వారా ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితం ఇవ్వగలదని భావిస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు సహితం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వాస్తు ఉండటం సహితం బిజెపికి అనుకూలంగా మారగలదని భావిస్తున్నారు. 

ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ నాటికి పూర్తిగా భిన్నంగా ఉండగలవని భావిస్తున్నారు. ప్రధాని మోదీ పట్ల గల ప్రజాదరణ రెండు తెలుగు రాష్ట్రాలలో చెక్కు చెదరలేదని, కేంద్రంలో మళ్ళి మోదీ ప్రభుత్వం ఏర్పడటం కోసం ప్రజలు వోట్ వేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సగం సీట్లలో బిజెపి బలమైన పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.