రామ మందిరం నిర్మాణం జరగాలి అంటున్న 69 శాతం

2019 లోక్  సభ ఎన్నికలలో అయోధ్యలో రామమందిరం నిర్మించడం కీలక అంశం కాగల అవకాశం కనిపితున్నది. ఇండియా టుడే - కార్వే నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో 69 శాతం మంది భారతీయులు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించవలసిందే అని స్పష్టం చేస్తున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే రామమందిరం నిర్మించ వలసిన అవసరం లేదని చెప్పారు. ఈ సర్వే లో మొత్తం 13 వేల మంది పాల్గొన్నారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి అవకాశం కల్పిస్తూ మోదీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు ను తీసుకు రావాలని 67 శాతం మంది ప్రజలు కోరుకొంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 24 శాతం మంది తాము ఆర్డినెన్సు కు అనుకూలం కాదని  చెప్పగా,9 శాతం మంది ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. 

ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్ట్ లో ఐదుగురు  సభ్యుల ధర్మాసనం ముంది. ఈ కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని ఒక ఇంటర్వ్యూ లో జనవరి 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పడం తెలిసిందే. కాగా,ఈ సర్వే లో 58 శాతం మంది సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన తర్వాత రామమందిరం నిర్మించాలని కోరుకొంటూ ఉండగా, 39 శాతం మంది మాత్రం ఈ లోపాన్ని నిర్మాణం జరగాలని చెబుతున్నారు. 12 శాతం మంది ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు.