రాజాసింగ్‌ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం

తెలంగాణలో గెలుపొందిన ఏకైక బీజేపీ శాసన సభ్యుడు, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. హిందీలో దైవసాక్షిగా ఆయన‌ ప్రమాణం చేశారు.

గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే. ఎంఐఎం పార్టీ నేత  ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రొటెం స్పీకర్‌గా చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టానని ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే అడుగు పెడతానని ఆ విధంగా చేశారు. 

ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేస్తూ, సీఎం కేసీఆర్‌ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు చేశారో ఆలోచించాలని ఆయన కోరారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.