24న సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపిక

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు జనవరి 24న అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్, లోక్ సభ లో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇతర సభ్యులు.

ఈ సమావేశాన్ని 21నే ఏర్పాటు చేయాలని తొలుత భావించినా, ఆ తేదీ తనకు వీలు కాదని ఖర్గే తెలపడంతో అందరికి అనుకూలంగా 24వ తేదీని నిర్ణయించారు.