వివేకానంద కేంద్ర కు గాంధీ శాంతి బహుమతి

కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర గ్రామీణాభివృద్ధి, విద్య, సహజ వనరుల అభివృద్ధిలో చేసిన కృషికి గుర్తింపుగా 2015 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా నాలుగు సంవత్సరాలకు ఈ అహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బహుమతి క్రింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక లను అందజేస్తారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గల అత్యున్నత కమిటీ ఈ బహుమతికి ఎంపికలను చేశారు. ఈ కమిటీలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగోయ్, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ ఉప ప్రధాని ఎల్ కె సభ్యులుగా ఉన్నారు.

2016వ సంవత్సరానికి మధ్యాహ్న భోజనంను లక్షలాది మంది బాలలకు దేశ వ్యాప్తంగా సమకూరుస్తున్న అక్షయ్ పాత్ర ఫౌండేషన్, దేశ వ్యాప్తంగా పారిశుభ్య పరిస్థితిని మెరుగు పరుస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సంయుక్తంగా ఎంపిక చేశారు.

2017వ సంవత్సరానికి దేశ వ్యాప్తంగా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని బాలలకు విద్య సమకూరుస్తూ, లాంగిక-సామజిక సమానత్వం కోసం విశేషంగా కృషి చేస్తున్న ఏకల్ అభియాన్ ట్రస్ట్ కు అందజేశారు. 2018వ సంవత్సరానికి దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా లెప్రసిని అంతమొందించడం కోసం కృషి చేస్తున్న యోహెయి శాసకవాను ఎంపిక చేశారు.