పురందేశ్వరి చైర్‌పర్సన్‌గా ఏపీ బిజెపి మేనిఫెస్టో కమిటీ

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చైర్‌పర్సన్‌గా, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కన్వీనర్‌గా రాష్త్ర ఎన్నికల ప్రణాళిక కమిటీని ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నియమించారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించే బాధ్యతను 11 మంది సభ్యులు గల ఈ కమిటీకి అప్పజెప్పారు.

కమిటీలో సభ్యులు : పి. విజయ బాబు, పీవీఎన్‌ మాధవ్‌, దాసరి శ్రీనివాసులు, షేక్‌ మస్తాన్‌, పాక సత్యనారాయణ, కె. కపిలేశ్వరయ్య, పి సన్యాసి రాజు, సుదీష్ రాంబోట్,  డీఏఆర్‌ సుబ్రహ్మణ్యం.

ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి చేపట్టనున్న కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 1 నుండి బస్సు యాత్రను జరుపనున్నారు. ఈ యాత్రను బిజెపి అధ్యక్షులు అమిత్ షా ప్రారంభిస్తారు.