ఆందోళన కలిగిస్తున్న చిన్నారుల మౌన వేదన !

ఆపదలో ఉన్న చిన్నారులను ఆడుకోవడం కోసం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098 ఫోన్ లు 24 గంటలు పనిచేస్తుంటాయి. వీటిని ఎవ్వరు ఫోన్ చేసినా వెంటనే ఆపదలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫోన్ చేస్తున్న వారిలో మూడోవంతు మందికి పైగా చిన్నారులు ఫోన్ చేసి తమ బాధ ఏమిటో చెప్పుకోలేక ముగాగా రోదిస్తూ ముగిస్తూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది.

గత మూడేండ్లలో 3 కోట్ల 40 లక్షల కాల్స్‌ దేశం మొత్తం మీద ఈ నెంబర్ కు వచ్చాయి. ఆ విధంగా 2015 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి వరకు వచ్చిన ఈ కాల్స్‌లో కోటీ 36 లక్షల కాల్స్‌ మౌన రోదనగానే రికార్డు కావడం గమనార్హం. సహాయం కోసం కాల్‌ చేసిన చిన్నారులు తమ బాధను చెప్పుకోలేక మౌనంగా రోదించిన ధ్వనులు రికార్డయ్యాయి. కొన్ని నిమిషాలపాటు చిన్నారులు ఫోన్లకు అంటిపెట్టుకొని రోదించడం గమనార్హం.

న్నారుల నుంచి వచ్చిన ఈ సైలెంట్‌ కాల్స్‌ను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్టు చైల్డ్‌లైన్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధి హర్లీన్‌ వాలియా తెలిపారు.  మౌనంగా రోదించే చిన్నారులకు ధైర్యం చెప్పి వారి కష్టాలేమిటో తెలుసుకోవాల్సిందిగా హెల్ప్‌లైన్‌ ఉద్యోగులకు సూచించినట్టు వాలియా చెప్పారు. సైలెంట్‌ కాల్స్‌ ఉన్నత మధ్యతరగతి, ధనికుల చిన్నారుల నుంచి కూడా వచ్చినట్టు కనుగొన్నారు.

వేరుపడ్డ తల్లిదండ్రుల వల్ల, కుటుంబ తగాదాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్న చిన్నారుల నుంచి ఇటువంటి కాల్స్‌ వచ్చినట్టు భావిస్తున్నారు. అటువంటి వారితో ఓదార్పుగా మాట్లాడి ధైర్యం కలిగించినపుడు తమ బాధల్ని పంచుకునేందుకు ప్రయత్నించడం కొన్ని సందర్భాల్లో జరుగుతోందని తెలిపారు. ఈ మూడేండ్లలో మొత్తం 3కోట్ల 40లక్షల కాల్స్‌ రాగా, హెల్ప్‌లైన్‌ ద్వారా తమ సమస్యల పరిష్కారానికి జోక్యాన్ని కోరినవి 6లక్షల వరకూ ఉన్న ట్టు పేర్కొన్నారు.

వీటిలో 2లక్షల కాల్స్‌ తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారి నుంచి రక్షణ కోరుతూ చిన్నారులు చేసినవే కావడం గమనార్హం. ఇటువంటివి ఒక్క ఏడాదిలోనే(2017-18లో) 81,147 వచ్చాయి. మూడేండ్ల కాలంలోని కాల్స్‌లో భావోద్వే గాల పరంగా మద్దతు, మార్గదర్శనం కోరుతూ వచ్చి నవి 66,000.