కేసీఆర్ కూటమిలో జగన్ !

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేయదలచిన సమాఖ్య కూటమిలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ ను కూడా చేర్చుకొంటెందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయమై టి ఆర్ ఎస్ కార్యంరివాహక అధ్యక్షుడు కె టి రామారావు నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం కేసీఆర్ దూతలుగా జగన్ మోహన్ రెడ్డి ను బుధవారం కలసి సమాలోచనలు జరుపనున్నారు.

ఇప్పటికే ఈ విషయమై కేసీర్ స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఏం కె స్టాలిన్, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ తదితరులను కలసి ఈ విషయమై చర్చించారు. అయితే ఇప్పటి వరకు ఎవ్వరు అధికారికంగా ఈ కూటమిలో చేరిక పట్ల ఆసక్తి కనబరచ లేదు.

కేటీఆర్‌ తో పాటు ఎంపీ వినోద్‌ కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్‌ రెడ్డిలను జగన్ వద్దకు కేసీఆర్‌ పంపుతున్నారు. మధ్యాహ్నం విందుకు ఈ సందర్భంగా ఈ బృందాన్ని జగన్ ఆహ్వానించారు.

ఇప్పటికే రానున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రచారం చేస్తానని, జగన్ కు మద్దతు తెలుపుతానని కేసీఆర్ ప్రకటించారు. దానితో రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులపై వీరు ఈ సందర్భంగా చర్చించి, ఉమ్మడి రాజకీయ వ్యూహం రూపొందించుకొనే అవకాశం ఉంది.