కాంగ్రెస్ తో పొత్తుపై వెనుకకు తగ్గని కేఈ

`కాంగ్రెస్ దరిద్రం మాకొద్దు’ అంటూ ఆ పార్టీతో పొట్టు కోసం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాల పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ విషయంలో వెనుకకు తగ్గేటట్లు కనిపించడం లేదు. కృష్ణముర్తితో పాటు కాంగ్రెస్ తో కలిస్తే తాను పార్టీలో ఉండనని స్పష్టం చేసిన మరో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడులతో స్వయంగా చంద్రబాబునాయుడు ఫోన్ లో మాట్లాడి వారించినా వారి ధోరణిలలో మార్పు కనిపించడం లేదు.

కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తి లేదని ఇప్పటి వరకు చంద్రబాబునాయుడుగానే, పార్టీ పరంగా మరెవ్వరు గాని ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పక పోవడం గమనార్హం. అయితే సేనియర్లు అయి ఉంది ఇటువంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటం ఏమిటని, ఇటువంటి విషయాలపై పార్టీ పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొంటామని మీకు తెలుసు గదా అని మాత్రమె చంద్రబాబు వారితో చెప్పారు. మరోసారి ఈ విషయమై స్వరం విప్పిన కృష్ణముర్తి మిగిలిన చోట్ల ఏమో గాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ తో పొట్టు ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.

గత జూన్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పార్టీని కాంగ్రెస్ తో పొత్తు వరకు తీసుకు వెడితే తాను `ఆత్మహత్య’ చేసుకొంటాను అని కుడా కృష్ణముర్తి పేర్కొనడం పార్టీ వర్గాలలో సంచలనం కలిగించింది.  

అయితే తను చేసిన ప్రకటనపై ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కౌంటర్‌ ఇవ్వడం పట్ల కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు.  తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీలతో టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండబోదని ఆయన తెగేసి చెప్పారు.

ఇప్పటికే కేఈ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడిన సంగతి తెలిసిందే. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని అంటూ డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్‌ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్‌టీఆర్‌ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందని స్పష్టం చేసారు. కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు.

మరోమంత్రి నారాయణ సహితం కాంగ్రెస్ తో చేతులు కలిపే ప్రశ్నే లేదని స్పష్టం చేసారు. కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయమై పార్టీలో పెను దుమారం చెలరేగుతూ ఉండడంతో చంద్రబాబునాయుడు సహితం వ్యూహాత్మకంగా ఈ విషయమై మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తున్నది.