ప్రతిపక్షాల మహాకూటమి `అవకాశవాద కూటమి' : మోదీ


దేశంలోని పలు పార్టీలు తమకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న మహాకూటమిని ‘అవకాశవాద కూటమి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో  తమిళనాడులోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ... ‘వారు తమ సొంత సామ్రాజ్య నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. కానీ, మేము ప్రజల సాధికారత కోసం పనిచేస్తున్నాము' అని పేర్కొన్నారు.

 ప్రతి పక్షాలది తమ అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంటున్న స్వల్ప కాలిక కూటమి అని ప్రధాని మండిపడ్డారు. ఇతర పార్టీల్లా తాము  ఓటు బ్యాంకు కోసం.. విభజించు, పాలించు అనే విధానాన్ని పాటించట్లేదని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని తీసుకెళ్లాల్సి ఉందని చెబుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికలు బిజెపికి,  తెలిపారు. మన అభివృద్ధి అజెండాను మరింత ముందుకు దేశానికి చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. 

ఓ వైపు అభివృద్ధి అజెండాతో పని చేస్తున్నబిజెపి  ఉంది. మరోవైపు అవకాశవాద కూటమి, రాజవంశ పార్టీలు ఉన్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. తాను, ప్రభుత్వం సమర్థంగా పనిచేయట్లేదని కొందరు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ అదే నిజమైతే  తమను ఓడించేందుకు కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రధాని ప్రశ్నించారు.  ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని వారికి తెలుసని, అయితే  వారిపై వారికి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదని అసత్య ప్రచారం చేయడానికి వారు ఏ అవకాశాన్నీ వదులు కోవట్లేదని దుమ్మెత్తిపోశారు.  

యువత, రైతులు, మహిళలతో పాటు సమాజంలోని ప్రతి వర్గానికి ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉందని అంటూ మొదటి సారి ఓటు వేసేవారు సహజంగానే బిజేపికి మద్దతు తెలుపుతారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.  వారికి రాజవంశాల రాజకీయాలపై కాకుండా అభివృద్ధిపైనే ఆసక్తి ఉంటుందని చెబుతూ  హామీలు ఇచ్చే వారికి కాకుండా పనిచేసే వారికి మద్దతు తెలుపుతారని మోదీ భరోసా వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి చెప్పాలని మోదీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు పడుతోంది. మధ్యలో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. వస్త్ర పరిశ్రమ రంగంలో తమిళనాడు ప్రసిద్ధి చెందింది. మేము ఆ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకున్నాం. సూక్ష్య, మధ్య తరహా పరిశ్రమలకు మేము ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. 

రానున్న ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందని పేర్కొంటూ అది తన వల్లో, ఇతర ఏ నాయకుడి వల్లో కాదని, కేవలం బీజేపీ కార్యకర్తల వల్ల సత్తా చాటనుందని వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసమే మన కార్యకర్తలు పనిచేస్తారని అంటూ వారికి సొంత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.